iDreamPost

రైతులకు గుడ్ న్యూస్.. 2 లక్షల రుణమాఫీపై సీఎం కీలక ఆదేశాలు

  • Published Jun 10, 2024 | 10:10 PMUpdated Jun 10, 2024 | 10:10 PM

Good News To Farmers: తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. 2 లక్షల రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు.

Good News To Farmers: తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. 2 లక్షల రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు.

  • Published Jun 10, 2024 | 10:10 PMUpdated Jun 10, 2024 | 10:10 PM
రైతులకు గుడ్ న్యూస్.. 2 లక్షల రుణమాఫీపై సీఎం కీలక ఆదేశాలు

రైతు బాగుంటే దేశం బాగుంటుంది. అన్నం పెట్టే రైతుకి ప్రభుత్వాలు చేయూతనందించాలి. ఆర్థికంగా భరోసా ఇవ్వాలి. అప్పు చేసి పంట వేసే రైతన్న.. అదే అప్పు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అందుకే ప్రభుత్వాలు రైతులకు అండగా నిలబడుతున్నాయి. పంట పెట్టుబడికి సాయం అందిస్తున్నాయి. కాగా రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 లక్షల వరకూ రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రుణమాఫీ అంశంపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఆగస్టు 15 లోపు రైతులందరికీ ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ రుణమాఫీ హామీ అమలు దిశగా ఆయన కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం నిర్వహించి.. ఈ భేటీలో రైతు రుణమాఫీ అమలుపై విధివిధానాల గురించి చర్చించనున్నారు. అదే రోజున అధికారికంగా ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి సంబంధించి వివరాలను అధికారులు సేకరించారు. 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 10వ తేదీ వరకూ ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో ఆ ఋణం మొత్తం మాఫీ చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే రైతుల రుణాలకు సంబంధించి అధికారులు బ్యాంకర్లతో చర్చలు జరిపారు. బ్యాంకర్లు ఇచ్చిన డేటా ఆధారంగా రుణమాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది.

రుణమాఫీ అమలుకు సంబందించిన మార్గదర్శకాలపై అధికారులు ఇప్పటికే నివేదిక అందించారు. జూన్ 18న జరిగే క్యాబినెట్ మీటింగ్ లో ఈ మార్గదర్శకాలపై చర్చించి ఫైనల్ గా ఆమోదించనున్నారు. గతంలో రుణమాఫీ చేసినప్పుడు రైతు కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే మాఫీ వర్తింపజేశారు. మరి ఈసారి ఇలాంటి నిబంధనలు ఉండవన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా రైతు రుణమాఫీతో పాటు రాబోయే ఐదేళ్లకు సంబంధించి సంక్షేమ, అభివృద్ధి ప్రణాళికల గురించి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.     

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి