iDreamPost
android-app
ios-app

రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల! వివరాలు ఇవే!

Telangana: తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అంశాల్లో ముఖ్యమైనది పంట రుణమాఫీ. దీనిపై తాజాగా రేవంత్ సర్కార్ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Telangana: తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అంశాల్లో ముఖ్యమైనది పంట రుణమాఫీ. దీనిపై తాజాగా రేవంత్ సర్కార్ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల! వివరాలు ఇవే!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆరు గ్యారెటీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే వీటిల్లో కొన్ని ప్రారంభంగా..మరికొన్నిటిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో అందరు ఎక్కువగా ఎదురు చూస్తున్న అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి కొత్త రేషన్ కార్డుల విడుదల విషయం కాగా.. రెండోదో రైతుల రుణమాఫీ. దీని గురించి తెలంగాణ రైతులు ఎంతగానే  ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రైతుల రుణమాఫీపై రేవంత్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ‍క్రమంలో ప్రతీ కుటుంబం, రేషన్‌ కార్డును యూనిట్‌గా తీసుకోనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ రైతులు రుణమాఫీకి గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి..నెలలు గడుస్తున్నా రుణమాఫీకి గురించి కీలక ప్రకటన రాలేదు. దీంతో రైతన్నలు ప్రభుత్వం నుంచి వచ్చే తీపి కబురు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పంటల రుణమాఫీపై తెలంగాణ సర్కార్‌ మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ప్రతీ ‍యూనిట్‌లో మొదట మహిళలకు రుణమాఫీ చేయనున్నారు. ఆ తర్వాత ప్రాధాన్యత ప్రకారం రైతుల రుణాలను రద్దు చేయనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇక రుణమాఫీ అమలుకు రేషన్‌ కార్డు తప్పనిసరి అని సర్కార్ స్పష్టం చేసింది. తొలుత చిన్న మొత్తంలో రుణమాఫీలను చేసిన తర్వాతే పెద్ద రుణాలను మాఫీ చేయనున్నారు.

అంతేకాక పంట రుణమాఫీ మార్గదర్శకాల్లో మరికొన్ని అంశాలను ప్రస్తావించారు. రెన్యూవల్ చేసిన రుణాలకు ఈ స్కీమ్ వర్తించదు. పీఎం కిసాన్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అన్ని కమర్షియల్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, డిస్ట్రిక్ట్  కోపరేటివ్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుంది. ఇక 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 2023 మధ్య తీసుకున్న అన్ని పంట రుణాలను మాఫీ చేయనున్నారు. రేషన్ కార్డుల ప్రాతిపదికన రైతు కుటుంబాలను గుర్తిస్తారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాపీ జరగనుంది. తెలంగాణలో అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంల సమయంలో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీనితో పాటు మరో ఐదు గ్యారెటీలను అమలు చేస్తామని తెలిపింది. అలానే అధికారంలోకి వచ్చిన తరువాత  ఆ ఆరు గ్యారెటీలను అమలు చేసేందుకు కృషి చేస్తుంది. ఇప్పటికే పలు స్కీమ్ లను అమలు చేస్తుండగా..మరికొన్నిటిని అమలు చేసేందుకు కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగానే రైతు రుణమాఫీపై తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.