Arjun Suravaram
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్లను వసూలు చేయడం కోసం రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దానికి సంబంధించి కీలక జీవో జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్లను వసూలు చేయడం కోసం రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దానికి సంబంధించి కీలక జీవో జారీ చేసింది.
Arjun Suravaram
తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేయడానికి రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 26 నుంచి చలాన్ల పేమెంట్ పై డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో చాలా మంది తమ వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లను చెల్లించడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నేటి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీని వాహనదారులు కట్టుకోవచ్చు.
తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాయితి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా టీఎస్ ప్రభుత్వం చలాన్ల రాయితీపై జీవో విడుదల చేసింది. డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ద్విచక్ర వాహనాలపై 80 శాతం రాయితీని ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. త్రీ వీలర్స్ పై 90 శాతం రాయితీని ప్రకటించింది. అలానే కార్లకు 50 శాతం రాయితీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు రెండు కోట్లకు పైగా ఉన్న పెండింగ్ చలాన్లు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. దీంతో చాలా మంది పెండింగ్ చలాన్లు చెల్లించడానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆర్టీసీపై ట్రాఫిక్ చలాన్లకు 90 శాతం రాయితీ ఇవ్వగా.. టూ వీలర్స్ 80, ఆటోలపై 90 శాతం, కార్లపై 50 శాతం, తోపుడు బండ్లు, చిరు వ్యాపారులకు 90 శాతం రాయితీ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై, విడుదల చేసిన జీవోపై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చాలా మంది తమ పెండింగ్ చలాన్లు కట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరి.. పెండింగ్ చలాన్ల రాయితీపై తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.