iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. ఇకపై వారికి కూడా ఉచిత కరెంట్!

  • Published Jun 03, 2024 | 10:02 AM Updated Updated Jun 03, 2024 | 10:02 AM

ఉచిత కరెంట్ స్కీమ్ కు సంబంధించి రేవంత్ సర్కార్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అందులో భాగంగా ఇక నుంచి వారికి కూడా గృహజ్యోతి పథకం వర్తించబోతోంది. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

ఉచిత కరెంట్ స్కీమ్ కు సంబంధించి రేవంత్ సర్కార్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అందులో భాగంగా ఇక నుంచి వారికి కూడా గృహజ్యోతి పథకం వర్తించబోతోంది. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. ఇకపై వారికి కూడా ఉచిత కరెంట్!

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల్లో వెలుగు నింపాలని ‘గృహజ్యోతి’ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ లో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది రేవంత్ సర్కార్. అయితే ఉచిత కరెంట్ పథకం అమలులో వివిధ కారణాల వల్ల అర్హులు కూడా భాగం కాలేకపోయారు. ఇకపై వారికి కూడా ఉచిత కరెంట్ పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

గృహజ్యోతి ప్రథకం రాష్ట్రంలో అద్భుతంగా అమలు జరుగుతోంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని కొన్ని ప్రాంతాల్లో అర్హులైన వారికి ఈ పథకం వర్తించడం లేదు. ఎందుకంటే? సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో రంగారెడ్డి జోన్ పరిధిలోని సైబరాబాద్, రాజేంద్రనగర్, సరూర్ నగర్ సర్కిళ్లలో ఈ పథకం అమలు కాలేదు. దాంతో అక్కడి ప్రజలు కరెంట్ బిల్లులు కడుతూనే ఉన్నారు. అయితే ఎన్నికల కోడ్ ముగియగానే జూన్ 6 నుంచి ఈ ప్రాంతాల వారికి కూడా గృహజ్యోతి పథకం అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు ప్రకటించారు.

కాగా.. గతంలో అర్హత ఉండి, సాంకేతిక, ఎలక్షన్ కోడ్ కారణంగా సున్నా బిల్లులు రాని వారికి జూన్ 6 నుంచి పథకం అమలు చేయనున్నారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు, రేషన్ కార్డులను పరిశీలించి బిల్లులు అమలు చేయనున్నారు. రంగారెడ్డి జోన్ పరిధిలో అర్హులైన విద్యుత్ వినియోగదారులకు జూన్ 6 నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుంది. అయితే.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు సంబంధిత కార్యలయాలకు వెళ్లి.. అధికారులకు దరఖాస్తు చేసుకుంటే.. వాటిని పరిశీలించి, ఉచిత కరెంట్ బిల్లులు అందిస్తారు.