iDreamPost
android-app
ios-app

మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. రూ.1200 కోట్లు..

  • Published Feb 23, 2024 | 12:36 PM Updated Updated Feb 23, 2024 | 12:36 PM

Good News for Women Groups: తెలంగాణ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వరుసగా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహిళా సంఘాలకు శుభవార్త చెప్పారు.. అదేంటంటే..

Good News for Women Groups: తెలంగాణ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వరుసగా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహిళా సంఘాలకు శుభవార్త చెప్పారు.. అదేంటంటే..

  • Published Feb 23, 2024 | 12:36 PMUpdated Feb 23, 2024 | 12:36 PM
మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. రూ.1200 కోట్లు..

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ పథకాల హామీ ఇచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలు ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవొచ్చు. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్దిదారులకు రూ.10 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటుంది. ప్రగతి భవన్ పేరుని ప్రజా భవన్ గా మార్చి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభించారు. తాజాగా తెలంగాణ మహిళా సంఘాల వారికి రేవంత్ సర్కార్ శుభవార్త అందించారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ మహిళా స్వయం సహాయక సంఘాలకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూ.1200 కోట్ల మేర బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖకు సూచించింది. మహిళా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి చెక్కులను అందించేందుకు ఆ శాఖ సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,39,717 సంఘాల్లో 47,36,868 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 2014 నుంచి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకం అమల్లో ఉంది. మహిళా సంఘాలు తీసుకున్న లోన్ సకాలంలో బ్యాంకులకు చెల్లిస్తే.. ఆ మొత్తాలపై పడే వడ్డీ భారాన్ని ప్రతి సంవత్సరం ప్రభుత్వమే భరిస్తుంది.

ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ నిధులు జమలో కొంతకాలంగా జాప్యం జరుగుతూ వస్తుంది. గత ఫైనాన్షియల్ సంవత్సరం నాటికి రూ.2,000 కోట్ల మేరకు వడ్డీని ప్రభుత్వం చెల్లించవలసి ఉంది. గత ఏడాది ఆగస్టు నెలలో రూ.750 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన బకాయి రూ.1250 కోట్ల మేర ఉంది. ప్రస్తుతం కొన్ని మహిళా సంఘాల పేరు మీద ఈ బకాయిలు ఉన్నాయి. వాటి చెల్లింపు విషయంలో బ్యాంకులు ఒత్తిడి తీసుకువస్తున్నాయి. మరోపైపు మహిళా సంఘాలకు కొత్త లోన్లు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే మహిళలకు వడ్డీ బకాయిలను వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.