iDreamPost
android-app
ios-app

మహిళల కోసం ప్రభుత్వం స్పెషల్ యాప్.. ఇక సేఫ్టీ గురించి నో టెన్షన్!

  • Published Mar 12, 2024 | 9:14 PM Updated Updated Mar 12, 2024 | 9:14 PM

మహిళల కోసం ప్రభుత్వం ఓ స్పెషల్ యాప్​ను తీసుకొచ్చింది. ఇక మీదట సేఫ్టీ గురించి స్త్రీలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏంటా యాప్? దాని ప్రత్యేకతలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మహిళల కోసం ప్రభుత్వం ఓ స్పెషల్ యాప్​ను తీసుకొచ్చింది. ఇక మీదట సేఫ్టీ గురించి స్త్రీలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏంటా యాప్? దాని ప్రత్యేకతలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 12, 2024 | 9:14 PMUpdated Mar 12, 2024 | 9:14 PM
మహిళల కోసం ప్రభుత్వం స్పెషల్ యాప్.. ఇక సేఫ్టీ గురించి నో టెన్షన్!

మహిళలకు భద్రత అనేది ఈ రోజుల్లో పెద్ద సవాల్​గా మారింది. అక్కడ, ఇక్కడ అనే తేడాల్లేవు.. విమెన్ సేఫ్టీ అనేది అన్ని చోట్ల ఉన్న సమస్యగా చెప్పొచ్చు. అర్ధరాత్రి కాదు.. పట్టపగలే మహిళలు స్వేచ్ఛగా బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ సిచ్యువేషన్​లో పెద్దగా ఛేంజ్ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా తాజాగా ఓ యాప్​ను కూడా స్టార్ట్ చేసింది. ‘టీ-సేఫ్​’ పేరుతో పిలిచే ఈ యాప్​తో స్త్రీల భద్రత, ప్రయాణ పర్యవేక్షణ సేవల్ని పోలీసు శాఖ అందిస్తోంది. ఈ యాప్​ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీ-సేఫ్​ను స్టార్ట్ చేశారు సీఎం రేవంత్. ఇందులో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. టీ-సేఫ్ యాప్​ను అన్ని రకాల మొబైల్ ఫోన్స్​కు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేశారు. ఒంటరిగా ఉన్నప్పుడు, జర్నీ చేసేటప్పుడు ఏదైనా అనుకోని ఘటనలు సంభవిస్తే పోలీసుల నుంచి హెల్ప్ కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇందులో వాళ్ల సమస్యను తెలియజేస్తే.. వాళ్లు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీసు స్టేషన్​కు ఎస్​వోఎస్ మెసేజ్ వెళ్తుంది. దీంతో సాయం కోరిన వాళ్లు ఎక్కడ ఉన్నది పోలీసులకు తెలిసిపోతుంది. ఎస్​వోఎస్ మెసేజ్​ వచ్చిన క్షణాల్లోనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునేలా ఈ యాప్​ను రూపొందించారు.

TS GOVT make app for womens safty

టీ-సేఫ్ యాప్ రిలీజ్ అవడానికి ముందే చాలా సందర్భాల్లో మహిళలకు భద్రత కల్పించింది. దీని మీద మీడియాలోనూ చాలా న్యూస్ స్టోరీస్ వచ్చాయి. ఇక, స్త్రీలు ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో వెంటనే సాయాన్ని అందించడానికి, లైవ్ లొకేషన్ షేర్ చేసేందుకు, జర్నీ చేసే రూట్​ను నావిగేట్ చేసేందుకు, ఆకస్మిక మార్పులు జరిగిన టైమ్​లో ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందుతుంది. పోలీసులను అలర్ట్ చేసేందుకు వీలైన పలు ప్రత్యేక ఫీచర్లను కూడా టీ-సేఫ్ యాప్​లో యాడ్ చేశారు. ఈ యాప్ మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. మహిళల భద్రతకు ఉద్దేశించిన ఇలాంటి యాప్స్ తయారు చేయడం చాలా మంచి విషయమని మెచ్చుకుంటున్నారు. విమెన్ సేఫ్టీకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరి.. టీ-సేఫ్​ రూపంలో తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం యాప్ తీసుకురావడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: జగన్ బాటలో రేవంత్ రెడ్డి.. APలో మాదిరిగా వారందరికీ ఉద్యోగాలు..