iDreamPost
android-app
ios-app

CM రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం.. గల్ఫ్ మృతుల కోసం ఏకంగా..

  • Published Oct 08, 2024 | 12:20 PM Updated Updated Oct 08, 2024 | 12:20 PM

CM Revanth Reddy Historic Decision: కుటుంబ పోషణ కోసం, చేసిన అప్పులు తీర్చడం కోసం చాలా మంది యువత గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఆశలతో వెళ్లినవారు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబాల ఆవేదన మాటల్లో వర్ణించలేం.

CM Revanth Reddy Historic Decision: కుటుంబ పోషణ కోసం, చేసిన అప్పులు తీర్చడం కోసం చాలా మంది యువత గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఆశలతో వెళ్లినవారు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబాల ఆవేదన మాటల్లో వర్ణించలేం.

  • Published Oct 08, 2024 | 12:20 PMUpdated Oct 08, 2024 | 12:20 PM
CM రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం.. గల్ఫ్ మృతుల కోసం ఏకంగా..

తెలంగాణలో 2023 ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి దిగ్విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చి వేతకు ‘హైడ్రా’ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తాజాగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు చేసింది. ఇకపై గల్ఫ్‌లో ఎవరైనా తెలంగాణ కార్మికులు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనుంది ప్రభుత్వం.  ‘ప్రవాసి ప్రజావాణి’ పేరు తో ఫిర్యాదులను స్వీకరించనుంది. గల్ఫ్‌లో మరణించిన కార్మికుల పిల్లలకు గురుకులాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తెలంగాణలో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఉన్నవాళ్లు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్తున్న విషయం తెలిసిందే. ఎంతో ఆశతో ఎడారి దేశాలకు వెల్లిన వారు వివిధ కారణాల వల్ల అక్కడే చనిపోతున్నారు. దీంతో పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబాల పడే ఆవేదన అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ దురదృష్ట వశాత్తు మరణించిన ప్రవాస కార్మికులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. దీనికి సంబంధించిన జీవో నెంబర్ 216 ద్వారా అధికారి ఉత్వర్వులు జారీ చేసింది.

ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది:

ఈ ఎక్స్‌గ్రేషియా కువైట్, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ వంటి ఏడు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ వలస కార్మికులకు వర్తిస్తుంది. 2023 డిసెంబర్ 7 లేదా ఆ తర్వాత గల్ఫ్ లో చనిపోయిన కార్మికులకు ఇది అమలు అవుతుంది. మరణానికి కారణం ఏదైనా ఈ పరిహారం ఆయా కుటుంబాలకు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అంటే సహజ మరణం, ప్రమాదం, అనారోగ్యం లేదా ఇతర ఏదైనా ప్రమాదకర పరిస్థితిలో చనిపోయిన వారికి ఇది వర్తిస్తుంది.

దరఖాస్తు చేసుకునే విధానం :

ఈ పరిహారం గల్ఫ్ ప్రాంతాల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు అంటే భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు తమ స్థానిక జిల్లా కలెక్టర్ కి దరఖాస్తు చేసుకోవాలి. మరణ జరిగిన తేదీ లేదా మృత దేహాన్ని స్వీకరించిన తేదీ నుంచి ఆరు నెలల లోపు ఈ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కావాల్సిన పత్రాలు :

  • మరణ ధృవీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్)
  • రద్దు చేసిన పాస్ పోర్ట్
  • గల్ఫ్ లేదా ఇరాక్ దేశాల్లో పని చేసిన రుజువు (వర్క్ వీసా, ఉద్యోగ అగ్రిమెంట్ సర్టిఫికెట్స్)
  • అర్హులైన కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతా వివరాలు