iDreamPost
android-app
ios-app

వారికి సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. రూ.3 లక్షల ఆర్థిక సాయం!

వారికి సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. రూ.3 లక్షల ఆర్థిక సాయం!

ప్రజా సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా తగ్గటం లేదు. ప్రజలకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు గృహలక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధం అయింది. తాజాగా, గృహలక్ష్మి పథకం అమలు విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు నెలనుంచి గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా సొంత స్థలం ఉండి..

ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి ప్రభుత్వం 3 లక్షల రూపాయల ఆర్థికసాయం చేయనుంది. ప్రతీ సంవత్సరం నాలుగు లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇక, నియోజకవర్గం నుంచి మూడు వేల మందికి సాయం చేయదల్చుకుంది. ఓ పద్దతి ప్రకారం.. ముందుగా లబ్దిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనుంది. అన్నీ పక్కాగా ఉన్నాయా లేదా అని చెక్‌ చేసిన తర్వాత నిధులు మంజూరు చేయనుంది.

అది కూడా విడతల వారీగా ఇంటి నిర్మాణానికి సంబంధించిన నిధులను మంజూరు చేస్తుంది. అలా మూడు విడతల్లో లబ్ధిదారులకు మూడు లక్షల రూపాయలు అందనున్నాయి. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఈ పథకంలో ఎక్కువ ప్రాధాన్యత ఉండనుంది. ఏ పథకం ద్వారా లబ్ధిపొందని వారికి ఎక్కువ ప్రధాన్యత ఇవ్వనుంది. బీసీ, మైనార్టీలకు 50 శాతం ప్రాధాన్యత ఇవ్వనుంది. ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇక, మిగిలిన 20 శాతంలో ఆర్థికంగా వెనుకడిన కులాలకు ప్రభుత్వం సాయం చేయనుంది.

ఆన్‌లైన్‌ ద్వారా గృహలక్ష్మి పథకం కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులు మొత్తం కలెక్టర్‌ పరిశీలనకు వెళతాయి. ఆయన అర్హులైన వారిని గుర్తించి, ఆమోద ముద్ర వేస్తారు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాతే దశలవారీగా నిధులు మంజూరు అవుతాయి. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. మరి, తెలంగాణ ప్రభుత్వం త్వరలో అమల్లోకి తేనున్న గృహలక్షి పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.