పోలీసుల చేతికి కొత్త మెషీన్‌.. గంజాయి తాగితే ఇట్టే దొరికిపోతారు! అదేలా పనిచేస్తోందంటే..?

Telangana Government: ఇటీవల దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా యువత గంజాయి, డ్రగ్స్ మత్తులో జోగిపోతున్నారు. కొంతమంది స్వార్థపరులు డబ్బు సంపాదించడానికి యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన డ్రగ్ ఇప్పుడు గ్రామాల్లో విస్తరిస్తున్నాయి.

Telangana Government: ఇటీవల దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా యువత గంజాయి, డ్రగ్స్ మత్తులో జోగిపోతున్నారు. కొంతమంది స్వార్థపరులు డబ్బు సంపాదించడానికి యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన డ్రగ్ ఇప్పుడు గ్రామాల్లో విస్తరిస్తున్నాయి.

ఈ మధ్య కొంతమంది కేటుగాళ్లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల మోసాలు, అక్రమాలకు తెగబడుతున్నారు. డ్రగ్స్, గంజాయి దందా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. దేశంలో యువత మత్తుకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తులో తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో నేరాలకు పాల్పపడుతున్నారు. మైనర్లు సైతం గంజాయి మత్తులో జోగిపోతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దొంగచాటుగా ఈ దందా సాగుతూ చాపకింద నీరులా విస్తరిస్తుంది. మత్తుకు బానిసవుతున్న యువతను ప్రాథకిమ దశలోనే కాపాడేందుకు పోలీసులు వినూత్న ప్రక్రియ మొదలు పెట్టారు.. ఇక గంజాయి తాగే వారు తప్పించుకోలేరని హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సేవించి యువత ఎన్నో దారుణాలకు తెగబడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయిని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గుట్టుగా ఈ దందా కొనసాగిస్తున్నారు అక్రమార్కులు. అయితే గంజాయికి యువతే కాదు మైనర్లు కూడా బానిసలవుతున్నారు. మత్తుకు బానిలు కాకుండా ప్రాథమిక దశలోనే గుర్తించి వారిని కాపాడేందుకు పోలీసులు కొత్త పద్దతి మొదలు పెట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్లను ఉపయోగిస్తారు.. అదే విధంగా ఇప్పుడు గంజాయి తాగే వారిని గుర్తించేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గంజాయి టెస్ట్ కిట్లను ఉపయోగిస్తున్నారు. ఈ కిట్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లకు అందజేస్తుశారు. మునుగోడులో శనివారం పట్టుబడ్డ 35 మంది గంజాయి తాగేవాళ్లను పోలీసులు గుర్తించి టెస్ట్ కిట్లతో పరీక్షించారు. అందరూ గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది.

ఈ క్రమంలోనే గంజాయి సప్లై చేసేవారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కిట్స్ పోలీసుల చేతిలో తిరుగులేని ఆయుధంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల డ్రగ్స్, గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు ఎక్కడ బడితే అక్కడ ఈజీగా దొరుతుంది. కొంతమంది కేటుగాళ్లు పెరటి చెట్లలో పెంచుతుందే.. అపార్ట్ మెంట్ టెర్రాస్ పై పెంచుతున్నారు. ఆంధ్ర, ఒడిశా బార్డర్ తో పాటు విశాఖ ఏజెన్సీ నుంచి ఎక్కువగా గంజాయి తెలుగు రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించి గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ కిట్స్ తో తెలంగాణ పోలీసులు మత్తుకు బానిసైన వాళ్లను వెంటనే గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

Show comments