రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్.. వాళ్లకి మాత్రమే కొత్త కార్డులు?

Mallu Bhatti Vikramarka-New Ration Cards: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పథకాలకు రేషన్‌ కార్డు కీలకం. ఈ క్రమంలో తెలంగాణలో ఎంతో కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డుల విషయంలో బిగ్ అప్ డేట్ వచ్చింది.

Mallu Bhatti Vikramarka-New Ration Cards: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పథకాలకు రేషన్‌ కార్డు కీలకం. ఈ క్రమంలో తెలంగాణలో ఎంతో కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డుల విషయంలో బిగ్ అప్ డేట్ వచ్చింది.

మన దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ముఖ్యమైనది రేషన్ కార్డు. అంతేకాక ఇది పేదలకు ప్రాణవాయువు లాంటి కూడా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పథకాలకు రేషన్‌ కార్డు కీలకం. దీని ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తాము ప్రవేశపెట్టిన అనేక స్కీమ్ లకు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, ప్రభుత్వం మంజూరు చేసే ఇల్లు కావాలంటే రేషన్‌ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. రేషన్‌ కార్డుని కేవలం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఇస్తారు. ఇది ఇలా ఉంటే.. తెలంగాణలో ఎంతో మంది కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో కొత్త కార్డులకు సంబంధించి ఓ బిగ్ అప్ డేట్ వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దా..

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నసంగతి తెలిసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాక ముందు నుంచి చాలా కాలంగా కొత్త రేషన కార్డులు మంజూరు చేయలేదు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుందని ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన దగ్గర నుంచి రేషన్ కార్డుల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పొందాలంటే… ఈ కార్డే ప్రామాణికంగా మారింది. అలానే తెలంగాణలో అమలవుతోన్న ఆరు గ్యారెంటీలు కూడా రేషన్‌ కార్డు ప్రధానం మారింది. ఉచిత కరెంట్‌, 500 రూపాయలకు గ్యాస్‌, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ  రేషన్‌ కార్డే కీలకం. అందుకే కొత్త రేషన్‌కార్డుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీనిపై తాజాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.   కొత్త రేషన్ కార్డులపై ప్రత్యేక కమిటీ వేశామని, విధివిధానాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రేషన్ కార్డు లేని వారు చాలా మంది ఈ పథకాలు పొందలేకపోతున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా ప్రొగ్రామ్ ఏర్పాటు చేసి.. అర్హులైన లబ్ధిదారలకు నుంచి అఫ్లికేషన్లు తీసుకోనుంది.

కొత్తగా పెళ్లైన వారికి, పాత కార్డుల నుంచి వేరైన వారికి, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సొంతిళ్లు కొనుగోలు చేసిన వారికి కొత్త కార్డులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసిందని, కార్డుల జారీపై త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామన్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ నెలఖరు నాటి నుంచి కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో మంది ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు.

Show comments