iDreamPost
android-app
ios-app

రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం!

Crop Loan In Telangana: ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ సర్కార్.. మరికొన్నింటి అమలకు కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ విషయంలో అమలు చేసే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తుంది.

Crop Loan In Telangana: ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ సర్కార్.. మరికొన్నింటి అమలకు కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ విషయంలో అమలు చేసే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తుంది.

రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీపై  కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం!

తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలకు పెద్ద పీట వేస్తుంది. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలకు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తుండగా మరికొన్నింటి అమలకు కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ విషయంలో అమలు చేసే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే రుణమాపీ, రైతు భరోసా వంటివాటిపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్ట విక్రమార్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బుధవారం తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు సంబంధించిన పలు అంశాలపై ప్రస్తావించారు. రైతు భరోసాపై విధి విధానాలు రూపొందిస్తున్నామని, అందరి అభిప్రాయాలను తీసుకుంటామని ఆయన తెలిపారు. సంపద సృష్టించి.. దాన్ని ప్రజలకు పంచుతామని ఆయన తెలిపారు. రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతోందని, త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా పై కీలక ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు.

రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీలో సొంత నిర్ణయాలకు ఆస్కారం ఉందని ఆయన తెలిపారు. అన్ని జిల్లాల్లో రైతులతో, ప్రజలందరితో చర్చించిన తర్వాత ఓ రిపోర్టును తయారు చేస్తామని స్పష్టం చేశారు. ప్రధానంగా సంపద సృష్టించి రాష్ట్ర ప్రజలకు పంచాలన్నదే తమ ప్రభుత్వం ఆలోచనని తెలిపారు. ఇక ఇదే సమయంలో తెలంగాణలో త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తు వస్తున్నారు.

ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణకు ‘ప్రజా పాలన’ అనే కార్యక్రమం ఏర్పాటు చేసినసంగతి తెలిసింది.  అలానే రైతు సంక్షేమం గురించి వివిధ పథకాలు అమల్లోకి తీసుకోస్తున్నారు. ఆగస్టు 15 వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే రైతులందరూ రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. అలానే రైతు భరోసా  ఆర్థిక సాయం కోసం రైతన్నలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి చేసిన కీలక  వ్యాఖ్యలు రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక డిప్యూటీ సీఎం మాటలను చూస్తే..రుణమాఫీపై త్వరలో ప్రకటన రావచ్చని పలువురు అభిప్రాయా పడుతున్నారు.