Arjun Suravaram
Telangana Folk Singer Jayaraj: ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీలు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్ కూడా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
Telangana Folk Singer Jayaraj: ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీలు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్ కూడా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
Arjun Suravaram
ఇటీవల కాలంలో గుండెపోటుతో సంబంధించి మరణాల సంఖ్య బాగా పెరిగింది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరిలో ఈ హార్ట్ స్ట్రోక్ సంభవిస్తుంది. ఇలా గుండెపోటు కారణంగా సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా మృతి చెందారు. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్, నందమూరీ తారకరత్న వంటి పలువురు సెలబ్రిటీలు హార్ట్ ఎటాక్ కారణంగా మరణించారు. అలానే మరికొందరు తృటిలో దీన్ని నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా ప్రముఖ గాయకుడు జయరాజ్ గుండెపోటుకు గురయ్యారు.
ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక జానపద పాటలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇక జయరాజ్ గుండెపోటుకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయనకు హర్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు అలెర్ట్ అయ్యారు. గుండెపోటుకు గురైన జయరాజ్ ను కుటుంబ సభ్యులు నిమ్స్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో జయరాజ్ చేసిన కృషికిగాను తెలంగాణ ప్రభుత్వం 2023లో కాళోజీ నారాయణ రావు అవార్డుతో సత్కరించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన జయరాజ్ సమాజంలోని వివక్ష, అణచివేత, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అంతేకాక తెలంగాణ ఉద్యమ సమయంలో తనదైన ఆటపాటలతో అందరిని ఆకట్టుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించిన ప్రజా కవిగా జయరాజు గుర్తింపు సంపాదించారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రచించారు. బుధ్దుని బోధనలకు ప్రభావితమై అంబేద్కర్ రచనలతో స్పూర్తి పొందారు. వారు ముద్రించిన పలు పుస్తకాలు ప్రజాదరణ పొందాయి. ఆయన సినిమాలకు సైతం పాటలు రాశారు. ‘అడవిలో అన్న’ సినిమాకు హైలెట్‌గా నిలిచిన ‘వందనాలమ్మ పాట’ జయరాజ్ కలం నుంచి వచ్చిందే. దండోరా సినిమాలోని కొండల్లో కోయిల పాటలు పాడాలి అనే పాటను జయరాజ్ రాశారు.