iDreamPost
android-app
ios-app

సినిమా స్టైల్లో చేజ్ చేసి రూ.3 కోట్ల నగదు పట్టివేత!

  • Published Oct 16, 2023 | 11:26 AM Updated Updated Oct 16, 2023 | 11:26 AM
  • Published Oct 16, 2023 | 11:26 AMUpdated Oct 16, 2023 | 11:26 AM
సినిమా స్టైల్లో చేజ్ చేసి రూ.3 కోట్ల నగదు పట్టివేత!

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ గత సోమవారం ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో 579 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలక్షన్లు జరగనున్నట్లు ప్రకటించారు. అప్పటి రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు చోట్ల భారీ ఎత్తున నగదు పట్టుబడుతుంది. ఈసారి ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ఎన్నికల కమీషన్ గట్టి నిఘా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. మొన్న కర్ణాటక నుంచి తెలంగాణకు రూ. 42 కోట్ల తరలిస్తుండగా ముందుగానే అలర్ట్ అయి పట్టుకొని సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్నవాళ్లకు చెక్ పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసేందుకు సిద్దపడుతుంటారు. మద్యం, బంగారం, వెండి, చీరలతో పాటు నగదు పంపకాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి. ఈ మేరకు పార్టీ అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూనే ఉంటారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో పలు జిల్లాలకు భారీ ఎత్తున డబ్బు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా నల్లగొండ జిల్లాలో భారీ నగదు పట్టబడింది. ఓ వాహనం నుంచి పోలీసులు రూ.3.04 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో నల్లిగొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్ట్ లు పెట్టారు. ఈ క్రమంలో ఈదులుగూడ సిగ్నల్ వద్ద ఓ చెక్ పోస్టును ఏర్పాటు చేశారు.

ఈదులుగూడ చెక్ పోస్ట్ సమీపానికి రాగానే ఓ కారు వేగం వెళ్లిపోయింది. పోలీసుల ఆపమని చెప్పినా పట్టించుకోకుండా స్పీడ్ తో వెళ్లారు. వెంటనే ఆ వాహనాన్ని పోలీసులు వాడపల్లిలో పట్టుకొని తనిఖీ చేయగా.. అందులో రూ.3.04 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారిపై కేసు నమోదు చేసి డబ్బును సీజ్ చేశారు. కాగా.. డబ్బు తరలిస్తున్న వారు విపుల్ కుమార్ భాయ్, అమర్ సిన్హా జాలా లుగా గుర్తించారు. నల్లగొండ జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనికీ చేస్తున్నామని ఎస్పీ అపూర్వారావు తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, ఇతర వస్తువుల రవాణా అరికట్టడానికి ప్రత్యేక టీములు పనిచేస్తున్నాయని అయన తెలిపారు.