iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ఒంటిపూట బడులు ఎప్పటినుంచంటే?

Half Day Schools: రాష్ట్రంలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు నిర్ణయించింది.

Half Day Schools: రాష్ట్రంలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు నిర్ణయించింది.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ఒంటిపూట బడులు ఎప్పటినుంచంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగాయి. మార్చి మొదటి వారంలోనే హై టెంపరేచర్స్ నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15 నుంచి విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించనున్న విషయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా ఒంటిపూట బడులకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. ఏ సమయం నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలి? పదో తరగతి పరీక్షలు ఉన్న కేంద్రాల్లో ఏ సమయంలో పాఠశాలను నిర్వహించాలి? మధ్యాహ్నం భోజనం పథకానికి సంబంధించి కూడా కీలక ప్రకటన చేసింది.

రాను రాను క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు నిర్ణయించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలో పాఠశాలలకు ఒంటిపూట బడులను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఒంటిపూట బడులను నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలను నిర్వహించనున్నారు. 12.30 గంటల అప్పుడు మధ్యాహ్న భోజనం పెట్టిన తర్వాత స్కూలు ముగుస్తుంది. పదో తరగతి పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో ఉదయం పరీక్షలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టిన తర్వాత తరగతులను నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత యధావిధిగా ఉదయం 8.30 గంటల నుంచే ఒంటిపూట బడులు నిర్వహిస్తారు.

తెంలగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 18 నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యాశాఖ ప్రకటన ప్రకారం ఉదయం 9.30 గంటలకు పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. షెడ్యూల్ ఈ విధంగా ఉంది. మార్చి 18న ఫస్ట్ ల్యాంగ్వేజ్, మార్చి 19ల సెకండ్ ల్యాంగ్వేజ్, మార్చి 21న ఆంగ్ల పరీక్ష, మార్చి 23న గణితం, 26న సైన్స్ పార్ట్ 1 పరీక్ష, మార్చి 28న సైన్స్ పార్ట్ 2 పరీక్ష, మార్చి 30వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్షను నిర్వహించనున్నారు. మరి.. తెలంగాణ రాష్ట్రంలో ఒంటిపూట బడుల నిర్వహణ నిర్ణయం తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.