iDreamPost
android-app
ios-app

విజయశాంతికి కాంగ్రెస్ కీలక బాధ్యతలు..!

  • Published Nov 18, 2023 | 11:04 AM Updated Updated Nov 18, 2023 | 11:04 AM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీలోకి వలస వెళ్లిపోతున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీలోకి వలస వెళ్లిపోతున్నారు.

  • Published Nov 18, 2023 | 11:04 AMUpdated Nov 18, 2023 | 11:04 AM
విజయశాంతికి కాంగ్రెస్ కీలక బాధ్యతలు..!

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సందడి నడుస్తుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ప్రయత్నిస్తుంది. ఇక ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ లు అధికార పార్టీని గద్దెదింపి ఎలాగైనా తాము అధికారం దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో టికెట్ దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకొని చివరి సమయంలో భంగపడిన కీలక నేతలు ఇతర పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ తంతు ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికార పార్టీ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అయితే.. కాంగ్రెస్, బీజేపీలో ఉన్న సీనియర్ నేతలు గులాబీ కండువ కప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ కీలక నేత అయిన నటి విజయశాంతి.. బీజేపీ కి గుడ్‌బై కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈసారి జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో కొనసాగుతున్నారో అర్ధం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. పార్టీకి ఎంతోకాలంగా సేవలు అందిస్తున్నప్పటికీ అధిష్టానం టికెట్ విషయంలో సరైన ఆదరణ చూపించకపోవడంతో నిరాశతో ఇతర పార్టీలో చేరిపోతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, మంత్రి పదవిలో కొనసాగిన వారు సైతం పార్టీ కండువాలు మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినీ నటి, బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తో విజయశాంతి భేటీ అయిన అనంతరం కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గతంలో కొంతకాలం విజయశాంతి కాంగ్రెస్ లో కొనసాగారు.. తర్వాత బీజేపీ లో చేరారు. ఇటీవల బీజేపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ కి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన రాములమ్మకు తాజాగా కీలక పదవి అప్పజెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో విజయశాంతికి ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ లో చోటు కల్పించారు. ప్రచార కమిలీ చీఫ్ కో-ఆర్టినేటర్ గా తో పాటు ప్లానింగ్ కమిటీ కన్వీనర్ గా ఆమెకు బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా 15 మందికి కన్వీనర్ పోస్టులు అప్పగించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మహేశ్వరం టికెట్ ఆశించి భంగపడ్డ బడంగ్ పేట్ మేయర్ పారిజాతకి సైతం కన్వీనర్ పోస్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. నేడు విజయశాంతి ప్రెస్ మీట్ ఉంది.. ఆమె ప్రెస్ మీట్ లో బీజేపీ గురించి ఏం మాట్లాడబోతున్నారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది.