గల్ఫ్ బాధితుడిని కాపాడిన సీఎంఓ అధికారులు.. ఇది మరో గోట్ లైఫ్ కథ

బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ కు వెళ్లిన వారు ఎంతో మంది ఉంటారు. అక్కడ వారు ఎలాంటి కష్టాలు పడతారో తెలియనిది కాదు. తాజాగా ఓ గల్ఫ్ బాధితుడిని కాపాడి తిరిగి స్వస్థలానికి చేర్చారు అధికారులు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ కు వెళ్లిన వారు ఎంతో మంది ఉంటారు. అక్కడ వారు ఎలాంటి కష్టాలు పడతారో తెలియనిది కాదు. తాజాగా ఓ గల్ఫ్ బాధితుడిని కాపాడి తిరిగి స్వస్థలానికి చేర్చారు అధికారులు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దాదాపు అందరు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ సినిమా చూసే ఉంటారు. పేదరికంతో బాధపడుతున్న హీరో గల్ఫ్ కు వెళ్లి డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అప్పటికే తన భార్య గర్భవతిగా ఉన్నా కూడా హీరో ఆమెను వదిలిపెట్టి గల్ఫ్ కు వెళ్తాడు. ఆఫీస్ లో హెల్పర్ ఉద్యోగం అని చెప్పి తీసుకెళ్లి.. అక్కడ ఎడారిలో ఒంటెలు, గొర్రెల కాపరి ఉద్యోగం ఇస్తారు. తిరిగి తన దేశానికీ వద్దాం అనుకుంటే అక్కడి వారు అతనిని చిత్ర హింసలు పెడతారు. తినడానికి తిండి , త్రాగడానికి కనీసం నీరు కూడా ఉండదు. అలాంటి వారి నుంచి హీరో ఎలా తప్పించుకుని వచ్చాడన్నదే ఆ మూవీ కథ. అసలు ఇప్పుడు ఈ మూవీ స్టోరీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.. ఎందుకంటే అచ్చం ఈ సినిమాలో చూపించినట్లే.. సౌదీలో చిక్కుకుపోయిన ఒకరిని తెలంగాణ అధికారులు రక్షించి తిరిగి ఇండియాకు తీసుకుని వచ్చారు. ఈ రియల్ స్టోరీ ఏంటో చూసేద్దాం.

తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన రాథోడ్ నాందేవ్ అనే వ్యక్తి పొట్ట కూటి కోసం సౌదీ వెళ్ళాడు. హౌస్ కీపింగ్ ఉద్యోగం అని చెప్పి సౌదీకి తీసుకుని వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఆ బాధితుడిని ఒంటెల కాపరిగా పెట్టారు. తానూ వచ్చింది ఆ ఉద్యోగం కోసం కాదని ఎంత చెప్పిన పట్టించుకోలేదు. అతనిని తీవ్ర చిత్ర హింసలు పెట్టి.. తిండి పెట్టకుండా చేసిన పనికి డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసేవారట. దీనితో ఆ వేధింపులు తట్టుకోలేక అతను ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో బాగానే వైరల్ అయింది. అలా ఆ వీడియో తెలంగాణ సీఎంఓ వరకు చేరింది. దీనితో అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించారు. దుబాయ్ అధికారులతో కాంటాక్ట్ అయ్యి.. రాథోడ్ నాందేవ్ ను ఇండియాకు తీసుకుని వచ్చారు. ‘నాకు చెప్పింది ఒకటి చేయించింది ఒకటి. నన్ను చాలా వేధించారు. బాగా మోసం చేశారు. నా జీవితంలో ఇలాంటివి ఎప్పుడు అనుభవించలేదు.’ అంటూ బాధితుడు వాపోయాడు.

ఏదేమైనా తరచూ ఇలా మానవ అక్రమ రవాణాలు జరుగుతూనే ఉన్నాయి. డబ్బు సంపాదిద్దాం అని .. జీవితంలో ఓ మెట్టు ఎదుగుదాం అని.. కుటుంబాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్లేవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి అవసరాలను ఆసరాగా తీసుకునే అవకాశ వాదులు ఎంతో మంది ఉన్నారు. అక్కడి వారి యజమానులు పెట్టే చిత్ర హింసలు తట్టుకోలేక.. ప్రాణాలు విడిచి వారు ఇంకెంతో మంది ఉన్నారు. అధికారులు ఇలాంటి వారి కోసం సహాయాక చర్యలు తీసుకుంటేనే ఉన్నారు. అయినా కూడా ఇంకా ఎక్కడో ఒక దగ్గర.. ఎంతో మంది అమాయకులు అలాంటి వారి చేతిలో బలి అవుతున్నారు. మరి నిర్మల్ జిల్లాకు చెందిన రాథోడ్ నాందేవ్ ను తెలంగాణ అధికారులు రక్షించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments