iDreamPost
android-app
ios-app

సుల్తానాబాద్ అత్యాచార ఘటనపై CM సీరియస్.. DGP కీలక ఆదేశాలు!

Telangana CM Revanth Reddy Serious On Sultanabad Issue: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుల్తానాబాద్ బాలిక హత్యాచార ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Telangana CM Revanth Reddy Serious On Sultanabad Issue: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుల్తానాబాద్ బాలిక హత్యాచార ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు.

సుల్తానాబాద్ అత్యాచార ఘటనపై CM సీరియస్.. DGP కీలక ఆదేశాలు!

ఆరేళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గురువారం ఓ దుండగుడు పసిపాపపై తన కామవాంఛ తీర్చుకుని కడతేర్చాడు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని అస్సలు వదిలిపెట్టద్దు అన్నారు. పసిపాపై వికృతంగా ప్రవర్తించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి అంటూ తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలి అంటే ఆదేశించారు.

ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఈ దారుణం సంభవించింది. కాట్నపల్లిలోని మమతా రైస్ మిల్లులో ఆరేళ్ల బాలిక తన తల్లితో పాటు నిద్రిస్తోంది. అదే రైస్ మిల్లులో డ్రైవర్ గా పనిచేసే బలరాం అనే నీఛుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. గురువారం రాత్రి తల్లితో నిద్రిస్తున్న ఆ బాలికను అపహరించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ చిన్నారిపై దారుణానికి ఒడిగట్టమే కాకుండా.. బాలికను దారుణంగా హత్య చేశాడు. అర్ధరాత్రి తల్లికి మెలుకువ వచ్చి చూడగా అమ్మాయి కనిపించలేదు. వెంటనే తోటి కార్మికులకు ఈ విషయం చెప్పింది. తన కుమార్తె కనిపించడం లేదు అని అంతా వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో.. కార్మికుల సాయంతో ఆ తల్లి పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేసింది.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఆ దృశ్యాల్లో చిన్నారిని బలరాం తీసుకెళ్లడం రికార్డు అయ్యింది. పోలీసులు వెంటనే బలరాంను అరెస్టు చేశారు. ఆరేళ్ల బాలిక మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. దేశవ్యాప్తంగా పోలీసులు, అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇలా ఎన్నో కఠిన శిక్షలు తీసుకొస్తున్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. తుచ్యమైన కోరికలకు లొంగిపోయి పసి కందులను చిదిమేస్తున్నారు. పోలీసులు, న్యాయస్థానాలు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా కూడా ఇంకా మార్పు రావడం లేదు.