iDreamPost
android-app
ios-app

వారికి గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రూ. 2 లక్షల రుణమాఫీ!

  • Published May 04, 2024 | 4:29 PM Updated Updated May 04, 2024 | 4:29 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

  • Published May 04, 2024 | 4:29 PMUpdated May 04, 2024 | 4:29 PM
వారికి గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రూ. 2 లక్షల రుణమాఫీ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ప్రభావితమైన ప్రజలు ఆ పార్టీకే పట్టం గట్టారు. దీంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అధికారంలోకి రావడం రావడమే ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద సంతకం చేశారు. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో ప్రధానమైన వాటిని అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మిగతా పథకాలను కూడా అమలు చేసే ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు. భద్రాచలం రాముల వారి సాక్షిగా ఆగస్టు 15 లోపు రైతుల 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తానని కీలక ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల గురించి కీలక ప్రకటన చేశారు. దేశ రాజకీయాలకు ఖమ్మం జిల్లా ఒక దిక్సూచి అని.. ఈ జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని అన్నారు. ఖమ్మం జిల్లాకు పోరాటాల గడ్డగా పేరు ఉందని.. ఈ ఖమ్మం జిల్లాతో ఎవరూ పెట్టుకోవద్దని అన్నారు.

దేశంలోనే అత్యధిక మెజారిటీతో ఇచ్చే సెగ్మెంట్ ఖమ్మం జిల్లానే అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత విసిరినా ఛాలెంజ్ ని ఆయన స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలు, 2 లక్షల రుణమాఫీ చేస్తే స్పీకర్ ఫార్మాట్ లో తాను రాజీనామా చేస్తానని.. లేదంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ ని తాను స్వీకరిస్తున్నా అని రేవంత్ రెడ్డి అన్నారు. కొమరవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నాది అంటూ రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు.  

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbenjaminsbet girişgrandpashabet