తెలంగాణలో సివిల్స్ అభ్యర్థులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ. లక్ష!

Revanth Reddy, UPSC Exam: ఇప్పటికే రుణమాఫీ చేసి..రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్.. తాజాగా మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఒక్కొక్కరి రూ. లక్ష అందజేశారు.

Revanth Reddy, UPSC Exam: ఇప్పటికే రుణమాఫీ చేసి..రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్.. తాజాగా మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఒక్కొక్కరి రూ. లక్ష అందజేశారు.

తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసింది. అన్ని వర్గాల ప్రజలకు వివిధ రూపాల్లో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ముఖ్యం చదువుకునే విద్యార్థుల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే యువత కోసం పలు స్కీమ్స్ అమలు చేస్తుంది. అలానే ఇటీవలే సివిల్స్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం  రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ అనే పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింది. తాజాగా సివిల్స్ ప్రిలిమ్స్ రాసిన విద్యార్థులకు రేవంత్ సర్కార్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో పాసై.. మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారికి ఒక్కొక్కరికీ రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల యూపీఎస్సీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో మెయిన్స్  పరీక్షకు ఎంపికైన వారికి ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. తాజాగా సివిల్స్ మెయిన్స్ కి ఎంపికైన అభ్యర్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష రూపాయల చెక్కులను అందించింది. ఈ నేపథ్యంలో సివిల్స్ మెయిన్స్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను జిల్లాల వారీగా అధికారులు రిలీజ్ చేశారు.

బుధవారం సెక్రటేరియట్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు పాల్గొన్నారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి రూ.లక్ష చెక్కును స్వయంగా అందజేశారు. ఇక సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలు చూసినట్లు అయితే తెలంగాణ నుంచి మొత్తంగా 135 మంది ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు. జిల్లాల వారీగా ఈ రూ. లక్ష ఆర్థిక సాయానికి ఎంపికైన వారి జాబితాను కూడా అధికారులు రిలీజ్ చేశారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి 14 మంది యూపీఎస్సీ సివిల్స్ ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు.

వరంగల్‌ జిల్లాలో 12 మంది, మేడ్చల్‌ – మల్కాజ్‌గిరి 11, నల్గొండ 10 ఉన్నారు. మిగత జిల్లాల నుంచి కూడా మెయిన్స్ కి ఎంపికైన వారు ఉన్నారు. ఖమ్మం 9,కరీంనగర్‌ 8, మహబూబాబాద్‌, మంచిర్యాల్‌ జిల్లాల నుంచి 7, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి 5 చొప్పున ఎంపికయ్యారు. ఆ 135 అభ్యర్థులకీ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. మెయిన్స్ కు ఎంపికైన వారిలో  113 పురుషులు,  22 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇందులో 21 మంది జనరల్‌, 62 మంది ఓబీసీ, 19 మంది ఎస్సీ, 33 మంది ఎస్టీ కేటగిరీకి చెందిన వారు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Show comments