iDreamPost
android-app
ios-app

TS: ఆటో డ్రైవర్లు కు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. ఏకంగా రూ.5 లక్షలతో!

  • Published Dec 25, 2023 | 3:19 PMUpdated Dec 27, 2023 | 1:46 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. అదిరిపోయే బీమా పాలసీను కల్పిపిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆ హామీలను అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటన.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. అదిరిపోయే బీమా పాలసీను కల్పిపిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆ హామీలను అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటన.

  • Published Dec 25, 2023 | 3:19 PMUpdated Dec 27, 2023 | 1:46 PM
TS: ఆటో డ్రైవర్లు కు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. ఏకంగా రూ.5 లక్షలతో!

తెలంగాణా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణం వలన వేలాదిమంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఉపాధి దెబ్బతిన్నది. చాలామంది మహిళా ప్రయాణికులు ఈ ఫ్రీ బస్సు సదుపాయంతో బస్సుల్లో ప్రయాణించడం మొదలు పెట్టారు. అందువలన తాము ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆటో యూనియన్ వాళ్లు ఆందోళన చేపట్టారు. కాగా, ఈ సమస్యలన్నీ సీఎం దృష్టిలోకి చెేరడంతో వాటిని పరిష్కరించడానికి శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ ఆటో డ్రైవర్లు , క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్ లకు నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఆ సభలో తెలంగాణ ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ వంటి గిగ్ వర్కర్లకు సీఎం మంచి శుభవార్తను చెప్పారు. వీరికోసం అదిరిపోయే బీమా పాలసీలను అమలులోకి తీసుకొస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

తాజాగా హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ ల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. వీరందరికి ఓ మంచి శుభవార్తను కూడా తెలియజేశారు. త్వరలోనే వీరికోసం రూ. 5లక్షల ప్రమాద బీమాను అందించడంతో పాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే క్యాబ్ డ్రైవర్లకు ఓలా, ఉబర్ తరహాలో.. టీహబ్ ద్వారా సర్కార్ యాప్ ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇక, నాలుగు నెలల క్రితం.. ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు కుక్క తరమడంతో మూడో అంతస్తు నుంచి పడి చనిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ వివరాలను సేకరించిన సీఎం రేవంత్ రెడ్డి.. అతడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ఇక రాజస్థాన్ లో గిగ్ వర్కర్ల శ్రేయస్సు కోసం చట్టం చేశారని, దానిని అధ్యయనం చేసి అలాంటి చట్టాన్ని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. కాగా, అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆ క్రమంలోనే విధాన నిర్ణయం తీసుకుని, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సామాజిక రక్షణ కల్పించడంలో మా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

అలాగే ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడ దరఖాస్తుల్లో మీ వివరాలు అందించండని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక డిజిటల్, మాన్యువల్ ఏ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చు అన్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. కాగా, ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ సెక్రెటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, మాధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి