iDreamPost
android-app
ios-app

TS Budget 2024: 2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. 6 గ్యారెంటీలకు భారీగా నిధులు

  • Published Feb 10, 2024 | 1:18 PM Updated Updated Feb 10, 2024 | 1:30 PM

తెలంగాణ బడ్జెట్ 2024: నేడు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ని 12 గంటలకు ప్రవేశపెట్టారు. ఆరు గ్యారంటీలకు పెద్ద పీట వేశారు.

తెలంగాణ బడ్జెట్ 2024: నేడు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ని 12 గంటలకు ప్రవేశపెట్టారు. ఆరు గ్యారంటీలకు పెద్ద పీట వేశారు.

TS Budget 2024: 2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. 6 గ్యారెంటీలకు భారీగా నిధులు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ని ప్రవేశ పెట్టింది. త్వరలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పూర్తి నెలలకు గాను బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఉదయం భేటీ అయిన మంత్రి వర్గం ఈ పద్దుకు ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు తెలంగాణ ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను శాసన సభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. ఆరు గ్యారెంటీల హామీ అమలు, తెలంగాణ ప్రజల సంక్షేమమే తమ ధేయమని చెబుతూ.. రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్నట్లు వివరించారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు మీకోసం..

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ని శనివారం ఫిబ్రవరి 10న ప్రవేశ పెట్టారు. సంక్షేమం-అభివృద్దే ప్రధాన ధ్యేయంగా రేవంత్ సర్కార్ బడ్జెట్ ని ప్రవేశ పెడుతుందని అన్నారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో 6 గ్యారెంటీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ లో తెలిపారు. రూ.2,75,891 కోట్లతో తెలంగాన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు మంత్రి బట్టి విక్రమార్క. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూల ధన వ్యయం రూ.29,669 కోట్లు, ద్రవ్యలోటు రూ.రూ.33,786 కోట్లు ఉండగా., రెవెన్యూ ఖాతా లో మిగులు ప్రస్తుతం రూ.9,031 ఉన్నట్లు భట్టి ప్రకటించారు. మూలధన వ్యయం రూ.24,178 కోట్లు ఉందని, 2024-25 సంవ్సరానికి గాను సవరించిన అంచనాలు రూ.2,27,625 కోట్లు అని తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల కోసం కేటాయించిన 53 వేల 196 కోట్ల రూపాలను సమర్థవంతంగా పేద ప్రజలకు అందజేస్తామని అన్నారు. ఈ బడ్జెట్ లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించబోతున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. గొప్పలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ ని ప్రవేశ పెడుతున్నామని రేవంత్ సర్కార్ తెలిపింది. ఆర్థిక మంత్రి తరుపున శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశ పెట్టారు.

  • 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891కోట్లు
  • ఆరు గ్యారెంటీల పథకం కోసం 53196 కోట్ల అంచనా
  • పరిశ్రమల శాఖ 2543 కోట్ల కేటాయింపు
  • టెక్నాలజీ, ఐటి శాఖకు 774కోట్లు
  • వైద్య రంగం కోసం 11500 కోట్లు
  • విద్యుత్ మరియు గృహ జ్యోతికి 2418కోట్లు.
  • విద్యుత్ సంస్థల కోసం 16825 కోట్లు.
  • గృహ నిర్మాణాని కేటాయించింది 7740 కోట్లు.
  • ఎస్టీ సంక్షేమం కోసం 13013 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం కోసం 2262 కోట్లు
  • బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం 1546 కోట్లు.
  • బీసీ సంక్షేమం కోసం 8 వేల కోట్లు
  • ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణం 1250కోట్లు
  • ఎస్సి సంక్షేమం కోసం 21874 కోట్లు
  • తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం 500 కోట్లు.
  • యూనివర్సిటీల్లో సదుపాయాల కోసం 500 కోట్లు
  • నీటి పారుదల శాఖ కోసం 28024 కోట్లు
  • విద్యా రంగానికి 21389కోట్లు
  • పంచాయతీ రాజ్ 40,080 కోట్లు
  • పురపాలక శాఖకు 11692 కోట్లు
  • మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు
  • వ్యవసాయ శాఖ కు 19746 కోట్లు
  • తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు రూ.500 కోట్లు
  • యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు
  • ప్రతి నియోజవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు
  • ట్రాన్స్ కో, డిస్కంలకు రూ.16,825 కోట్లు
  • మూసీ ప్రాజెక్ట్ కు రూ.1000 కోట్లు
  • టీఎస్ పీఎస్‌సి కి రూ.40 కోట్లు