Dharani
తెలంగాణ విద్యార్థులకు కీలక అలర్ట్.. జూన్ 26న పాఠశాలలు బంద్ కానున్నాయా అంటే అవుననే సమాచారం వినిపిస్తోంది. ఎందుకంటే..
తెలంగాణ విద్యార్థులకు కీలక అలర్ట్.. జూన్ 26న పాఠశాలలు బంద్ కానున్నాయా అంటే అవుననే సమాచారం వినిపిస్తోంది. ఎందుకంటే..
Dharani
ఉత్తరాదిన హీట్ వేవ్ కొనసాగుతుంది కనుక అక్కడ పాఠశాలలకు వేసివి సెలవులను ఈ నెలాఖరు వరకు అనగా జూన్ 30 వరకు పొడగించారు. సుమారు 8 రాష్ట్రాల్లో వేసవి సెలవులను పొడగిస్తూ.. ఆయా ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఇక దక్షిణాదిన నైరుతి రుతుపవనాల కారణంగా.. వాతావరణం చల్లబడింది. దాంతో ఇక్కడ వేసవి సెలవులు అవ్వగానే యథావిధిగా స్కూల్స్ తిరిగి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే జూన్ 12, 13 నుంచే పాఠశాలలు తిరిగి ప్రారంభించారు. ఇప్పటికే బక్రీద్ సందర్భంగా విద్యార్థులకు సెలవు ఇవ్వగా.. ఇక జూన్ 26 అనగా బుధవారం నాడు తెలంగాణలో పాఠశాలలు బంద్ కానున్నాయి అని టాక్. ఆ వివరాలు..
తెలంగాణలో జూన్ 26 అనగా బుధవారం నాడు పాఠశాలలు బంద్ చేయాల్సిందిగా ఏబీవీపీ కోరింది. రాష్ట్రంలో స్కూల్స్ ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు పుస్తకాల పంపిణీ పూర్తి కాలేదని.. అలానే ప్రైవేటు పాఠశాలల్లో ఒక్క పద్దతి లేకుండా భారీగా ఫీజులు పెంచాయని ఆరోపించింది. దీనిపై కూడా రాష్ట్రప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. అలాగే స్కూల్స్‌లో మౌలిక వసతులు కల్పించాలి అని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఈ డిమాండ్ల సాధనకై.. జూన్ 26న తెలంగాణలోని ప్రతి పాఠశాలను స్వచ్ఛందంగా మూసివేసి.. అందరు సహకరించాలి అని ఏబీవీపీ కోరింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఏబీవీపీ ప్రకటనపై పాఠశాలల యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.
ఈ సారి పాఠశాలల్లో ప్రతి రోజూ 90 శాతానికిపైగా విద్యార్థుల హాజరు ఉండాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం తరగతులు, సబ్జెక్టుల వారీగా పిల్లలు నేర్చుకోవాల్సిన అంశాలను నిర్దేశించినందున వీటిని పూర్తి స్థాయిలో సాధించేందుకు.. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని విద్య శాఖ పేర్కొంది. ప్రభుత్వం కొత్త విద్యాసంవత్సరానికి(2024-25) సంబంధించిన అకడమిక్ క్యాలెండరును విడుదల చేసి.. మార్గదర్శకాలు వెలువరించింది. వాటిని అమలు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి నెలా 4వ శనివారం స్కూల్స్‌లో నో బ్యాగ్ డేను అమలుచేయనున్నారు. ఆ రోజున విద్యార్థుల చేత సుమారు 30 నిమిషాల పాటు పాఠ్యపుస్తకాలు, కథల పుస్తకాలు, దినపత్రికలు, మేగజైన్లు చదివించాలి. టీవీ పాఠాలను యథావిధిగా ప్రసారం చేయాలి. విద్యార్థులతో 5 నిమిషాలు యోగా, ధ్యానం చేయించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.