iDreamPost

టీచర్లకు గుడ్ న్యూస్.. 19 వేల మందికి త్వరలో..

Good News for Teachers: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది టీచర్లు తమకు సంబంధించిన పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Good News for Teachers: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది టీచర్లు తమకు సంబంధించిన పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

టీచర్లకు గుడ్ న్యూస్.. 19 వేల మందికి త్వరలో..

గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదీలీలకు సంబంధించిన షెడ్యూల్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వరుసగా ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ విషయం ఆలస్యం అవుతూ వస్తుంది. వేల మంది టీచర్లు ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో టీచర్లకు గుడ్ న్యూస్.. త్వరలో ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన షెడ్యూల్ నేడో, రేపో రిలీజ్ అయ్యే ఛాన్సు ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది టీచర్లు ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్ల గురించి ఎదురు చూస్తున్నారు.  గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు.. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఎన్నికల కోడ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతూ వస్తుంది. ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటున్న విషయం తెలిసిందే.. ఆయన పదోన్నతులకు సంబంధించిన పచ్చ జెండ ఊపడమే ఆలస్యం అయ్యింది. ఎన్నికల కోడ్ ముగియగానే ఆయన ఈ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

good news for teachers

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ పూర్తయితే 10,449 మందికి ఎస్ఏలుగా, 778 మందికి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా, 6 వేల మందికి ఎస్‌జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడో, రేపో టీచర్ల పదోన్నతులు షెడ్యూల్ రిలీజ్ కావొచ్చని పాఠశాల విద్యాశాఖ వర్గల్లో చర్చ నడుస్తుంది. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబ్ నెలల్లో పదోన్నతుల, బదిలీల ప్రక్రియ మొదలు పెట్టారు. గత ఏడాది ఎక్కడ ఆగిందో.. అక్కడ నుంచి మళ్లీ ఈ ప్రక్రియ మొదలు కానుంది. జోన్ – 1 లో కొంత ప్రక్రియ పూర్తి కావడం వల్ల ఒక షెడ్యూల్, మల్టీ జోన్ – 2 కి సంబంధించి మరో షెడ్యూల్ జారీ కానున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి