iDreamPost
android-app
ios-app

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంట తీవ్ర విషాదం..

  • Published Jun 10, 2024 | 8:30 AM Updated Updated Jun 10, 2024 | 8:30 AM

Talasani Srinivas Yadav: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల ఇళ్లళ్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం రామోజీ రావు కన్ను మూయగా.. నేడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

Talasani Srinivas Yadav: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల ఇళ్లళ్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం రామోజీ రావు కన్ను మూయగా.. నేడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Jun 10, 2024 | 8:30 AMUpdated Jun 10, 2024 | 8:30 AM
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంట తీవ్ర విషాదం..

మోండా మార్కెట్‌ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు తలసాని శంకర్‌ యాదవ్‌ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్‌ యాదవ్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్ను మూశారు. అనారోగ్యానికి గురైన శంకర్‌ యాదవ్‌ని చికిత్స నిమిత్తం.. కొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ఇలా ఉండగా.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ యాదవ్‌ సోదరుడు శంకర్‌ యాదవ్‌.. సోమవారం తెల్లవారుజామున కన్ను మూశారు. దీంతో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధు, మిత్రులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. సనత్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. గతంలో బీఆర్‌ఎస​ పార్టీలో రెండు సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2014లో కేసీఆర్ తొలి మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. రెండవ మంత్రివర్గంలో కూడా మంత్రిగా చేశాడు. శ్రీనివాస్ యాదవ్ కు స్వర్ణతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతంలో బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా తలసాని శంకర్ యాదవ్ పని చేశారు.

ఇక తెలుగు రాష్ట్రాలను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రెండురోజుల క్రితం మీడియా సంస్థల అధినేత రామోజీ రావు కన్ను మూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఇక ఆదివారం నాడు ఆయనకు రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇక మహాకవి శ్రీశ్రీ కుమారుడు కూడా అమెరికాలో కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయనకు అమెరికాలో అంత్య క్రియలు నిర్వహించారు. ఇక నేడు శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు కన్ను మూశారు. వరుస మరణాలతో ప్రముఖుల ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్‌ యాదవ్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు. ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.