Dharani
పండుగల వేళ, ఆషాడం, శ్రావణ మాసాల్లో బట్టల దుకాణాలు భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా దసరా సందర్భంగా ఓ దుకాణం భారీ ఆఫర్ ప్రకటించింది. కేవలం 10 రూపాయలకే పట్టు చీర అని ప్రకటించింది. దాంతో మహిళలు భారీ ఎత్తున ఎగబడ్డారు. ఇంతకు ఈ ఆఫర్ ఎక్కడ అంటే..
పండుగల వేళ, ఆషాడం, శ్రావణ మాసాల్లో బట్టల దుకాణాలు భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా దసరా సందర్భంగా ఓ దుకాణం భారీ ఆఫర్ ప్రకటించింది. కేవలం 10 రూపాయలకే పట్టు చీర అని ప్రకటించింది. దాంతో మహిళలు భారీ ఎత్తున ఎగబడ్డారు. ఇంతకు ఈ ఆఫర్ ఎక్కడ అంటే..
Dharani
పండుగ అంటేనే.. కొత్త బట్టలు, పిండి వంటలు, ఆత్మీయులతో కలిసి సంతోషంగా గడపడం ఇవన్ని ఉంటాయి. కానీ అన్నింటికన్నా ముఖ్యమైంది పండుగ వేళ షాపింగ్. చిన్ని చిన్న పండుగల సమయంలోనే మన వాళ్లు షాపింగ్ చేస్తారు. ఇక దసరా వంటి పెద్ద పండుగల వేళ.. షాపింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొందరైతే నవరాత్రులు కాబట్టి.. ప్రతి రోజుకు ఒకటి చొప్పున చీరలు కొనుగోలు చేస్తారు. ఇక ఆడవారికి పట్టు చీరలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక పండుగ సందర్భంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు మాల్స్ రకరకాల ఆఫర్లు ప్రకటిస్తాయి. అయితే సాధారణంగా షాపింగ్ మాల్స్ 10-50 శాతం వరకు ఆఫర్లు ప్రకటిస్తాయి. కానీ ఈ సారి దసరా పండుగ సందర్భంగా ప్రకటించిన ఓ ఆఫర్ గురించి తెలిస్తే.. వావ్ ఇది కదా అసలైన పండుగ అంటారు. కేవలం 10 రూపాయలకే పట్టుచీర అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. అది మన దగ్గరే. ఆ ఆఫర్ పూర్తి వివరాలు..
తెలంగాణలో బతుకమ్మ, దసరా పెద్ద పండుగలు. ఈ క్రమంలో ఈ పండుగ సందర్భంగా ఓ బట్టల దుకాణం.. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనే లాంటి ఆఫర్ ప్రకటించింది. అదే సూర్యాపేట పట్టణంలోని శ్రీ విగ్నేశ్వర సిల్క్ సెంటర్. కొన్ని రోజుల క్రితం ముసివేసిన ఈ షాప్‌ని పండుగ సందర్భంగా షాప్‌ని రీ ఓపెన్ చేశారు. ఈ క్రమంలో షాప్ రీఓపెనింగ్‌తో పాటు బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని.. వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించారు షాప్. ఇందులో భాగంగా.. కేవలం 10 రూపాయలకే పట్టుచీర పేరుతో ఓ బంపరాఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
నార్మల్‌గా ఆఫర్లు అంటేనే మనవాళ్లు ఎగబడతారు.. అలాంటిది ఇక పది రూపాయలకే చీర.. అందులోనూ పట్టుచీర అంటే ఇక ఆగుతారా.. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. ఆఫర్ గురించి తెలిసిన వెంటనే.. మహిళలు పెద్ద ఎత్తున ఈ షాప్ దగ్గరకు క్యూ కట్టారు. ఈ ఆఫర్ కింద సుమారు 600 వరకు పట్టు చీరలను అమ్మారంట. అయితే.. ఈ ఆఫర్ కేవలం రెండు రోజుల వరకే ఉంది. అయినా సరే ఆఫర్ ప్రకటించినప్పటి నుంచే.. దుకాణానికి రద్దీ పెరిగిందని చెప్తున్నారు నిర్వాహకులు.
అయితే ఈ ఆఫర్ ఉన్న 2 రోజులు మాత్రం పది రూపాయల చీరను దక్కించుకునేందుకు మహిళలు భారీ ఎత్తున షాప్ దగ్గరకు క్యూ కట్టారట. కిలో మీటర్ల మేర క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో.. ఈ షాప్ పేరు పట్టణంలోనే కాదు జిల్లా మొత్తం మారుమోగిపోయింది. అయితే.. దుకాణంలో మిగతా ఆఫర్లు కూడా ఉన్నాయని చెప్తున్న నిర్వాహకులు.. పది రూపాయలకే పట్టుచీర అనే ఆఫర్‌ను మరోసారి ప్రకటించే ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.