iDreamPost
android-app
ios-app

వీడియో: బదిలీపై వెళ్తున్న టీచర్.. వెళ్లొద్దంటూ కాళ్లపై పడిన విద్యార్థులు!

Mahabubabad: విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అందుకే గురువులు బదిలీపై పాఠశాలను వదిలి వెళ్తున్నారని తెలిస్తే మాత్రం.. గుండెలు కరిగేలా విద్యార్థులు రోదిస్తుంటారు.

Mahabubabad: విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అందుకే గురువులు బదిలీపై పాఠశాలను వదిలి వెళ్తున్నారని తెలిస్తే మాత్రం.. గుండెలు కరిగేలా విద్యార్థులు రోదిస్తుంటారు.

వీడియో: బదిలీపై వెళ్తున్న టీచర్.. వెళ్లొద్దంటూ కాళ్లపై పడిన విద్యార్థులు!

సమాజంలో తల్లిదండ్రుల తరువాత గురువునే దేవుడితే సమానంగా భావిస్తారు. మనకు కనిపించే ప్రత్యక్ష దైవంగా ఉపాధ్యాయుడిని పూజిస్తారు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే..గురువులు వారికి జీవితాన్ని ప్రసాధిస్తారు. వారికి కేవలం విద్యా బోధనే కాకుండా.. వారిని సమాజంలో సన్మామార్గంలో నడిచేలా గురువులు కృషి చేస్తారు. విద్యార్థుల్లోని అజ్ఞానాన్ని తొలగించి..విజ్ఞాన కాంతులను వెలిగిస్తారు. ఇక చాలా మంది టీచర్లు విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటారు. అందుకే విద్యార్థులు కూడ గురువుపైన ఎంతో ప్రేమానుబంధాలను పెంచుకుంటారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లే సందర్భాల్లో…విద్యార్థులు గుండెలు కరిగేలా విలపిస్తుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ జరిగినా తాజాగా మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. టీచర్ ను వెళ్లొద్దంటూ చుట్టుముట్టి కన్నీరు పెట్టుకున్నారు. హృదయాన్ని ఆకట్టుకునే ఆ సంఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…

విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది.  అందుకే ఎక్కడ చదువుకున్నా, ఎక్కడికి వెళ్లినా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా..చదువు చెప్పిన గురువు కనిపించగానే నమస్కారం చేస్తుంటాము. అంతలా ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంటారు. కొందరు టీచర్లు మాత్రం పిల్లలను తమ సొంత బిడ్డలతో సమానంగా చూస్తారు. అంతేకాక పాఠాలు చెప్పడంతో ప్రత్యేక శైలితో పిల్లలను ఆకట్టుకుంటారు. అందుకే కొంతమంది ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు అమితమైన ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. ఇలాంటి టీచర్ తమకు దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తుంటారు. అయితే ఆ గురువులు బదిలీపై పాఠశాలను వదిలి వెళ్తున్నారని తెలిస్తే మాత్రం.. గుండెలు కరిగేలా విద్యార్థులు రోదిస్తుంటారు.

ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలు జరుగుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే  మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు  మండలం బ్రాహ్మణ కొత్తపల్లి ప్రైమరీ స్కూల్ లో రంజాన్ అనే టీచర్ విధులు నిర్వహిస్తున్నారు. ఇక బదిలీలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ పని చేస్తున్న రంజాన్ ను వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. ఇక అప్పటి వరకు పని చేసిన పాఠశాలను వదలి వెళ్తున్న సమయంలో విద్యార్థులు చేసిన పనికి ఆయన కూడా కన్నీరు పెట్టుకున్నారు. రంజాన్ వెళ్తుంటే.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు సార్ అంటూ.. అక్కడి విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. ఆయను అక్కడి నుంచి కదలకుండా కాళ్లపై పడిపోయారు. ఇక వారిని ఆవేదనను ఆపడం ఎవరితరం కాలేదు. చివరకు రంజాన్ సారే విద్యార్థులను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అంతేకాక తాను ఎప్పటికీ మిమ్మల్ని కలుస్తుంటాని ఆ వారికి సర్థి చెప్పారు. ప్రస్తుతం ఈ ఉపాధ్యాయుడి కోసం విద్యార్థులు గుండెలు కరిగేలా కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతటి ప్రేమానురాగాలు పొందిన ఆ గురువు గారికి వందనాలు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి