iDreamPost
android-app
ios-app

మల్లారెడ్డి వర్సిటీలో మళ్ళీ రచ్చ! విద్యార్థుల ఆందోళన! రంగంలోకి పోలీసులు!

నెలకో సమస్యతో వార్తల్లో నిలుస్తుంది మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆధ్వర్యంలోని యూనివర్శిటీ.. తాజాగా మరోసారి మల్లా రెడ్డి యూనివర్శిటీ విద్యార్థులు రోడ్డుకెక్కారు.

నెలకో సమస్యతో వార్తల్లో నిలుస్తుంది మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆధ్వర్యంలోని యూనివర్శిటీ.. తాజాగా మరోసారి మల్లా రెడ్డి యూనివర్శిటీ విద్యార్థులు రోడ్డుకెక్కారు.

మల్లారెడ్డి వర్సిటీలో మళ్ళీ రచ్చ! విద్యార్థుల ఆందోళన! రంగంలోకి పోలీసులు!

‘పాలమ్మినా, పూలమ్మనా, కష్టపడ్డా, విజయం సాధించా’ అంటూ గత ఏడాది అంతా ట్రెండింగ్‌లో నిలిచారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి. ఈ డైలాగ్‌తో సినీ సెలబ్రిటీల కన్నా ఎక్కువ పాపులారిటీ ఆయనకే వచ్చింది. అయితే ఇటీవల మాత్రం వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్శిటీలోని హాస్టల్లో తమకు పురుగుల ఆహారం అందిస్తున్నారంటూ విద్యార్థినులు క్యాంపస్‌లో నిరసనకు దిగిన సంగతి విదితమే. ఆహార భద్రత విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థినులు మండిపడటంతో.. స్వయంగా ఆయనే కలగ చేసుకున్నారు. స్వయంగా హాస్టల్‌కు వచ్చి.. అక్కడ భోజనం చేశారు. ఇలాంటివి పునరావృతం కావని చెప్పడంతో ఆ సమస్య సద్దుమణిగింది.

ఇప్పుడు మరోసారి ఈ యూనివర్శిటీ వార్తల్లో నిలిచింది. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్శిటీకి చెందిన 60 మంది విద్యార్థులను డీటైన్ చేసింది యాజమాన్యం. దీంతో యూనివర్శిటీ దగ్గర నిరసనలకు దిగారు విద్యార్థులు. మల్లారెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. సమాచారం పోలీసులకు చేరడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరి ఎంట్రీతో మరింత ఉద్రిక్తత పరిస్థితులు దారి తీశాయి. పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదంతో పాటు తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దుతుగా నిలిచారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు. తమను అకారణంగా డీటైన్ చేశారంటూ విద్యార్థులు నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. దీనిపై యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

మల్లారెడ్డి నేతృత్వంలోని యూనివర్శిటీలో నెలకొన్న సమస్యలతో రోడ్ల మీదకు ఎక్కుతున్నారు విద్యార్థులు.  నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు.  యాజమాన్యం వైఖరికి నిరసనగా అగ్రికల్చర్ యూనివర్శిటీ ప్రాంగణంలోనే ధర్నాకు దిగారు. మొన్న ఆహారం విషయంలో హాస్టల్ విద్యార్థినులు అర్థరాత్రి ఆందోళనలకు దిగగా.. తాజాగా 60 మంది విద్యార్థులను డీటైన్ చేయడంతో మరోసారి అగ్గి రాజుకుంది. మల్లారెడ్డి దిష్టి బొమ్మను తగులబెట్టడంతో పాటు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఆందోళనలు విరమింపజేసేందుకు పోలీసులు ప్రయ్నతించారు.  ఈ క్రమంలోనే పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం నెలకొంది.