వీడియో: GHMC కార్మికులపై రాళ్ల దాడి! కారణం ఏమిటంటే?

Stone Pelting on GHMC Workers: ఇటీవల ఫుట్ పాత్ పై చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను ఇష్టానుసారంగా జరుపుకుంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు.

Stone Pelting on GHMC Workers: ఇటీవల ఫుట్ పాత్ పై చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను ఇష్టానుసారంగా జరుపుకుంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు.

ఫుట్ పాత్ పై ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించవొద్దని చిరు వ్యాపారులకు అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. ఫుట్ పాత్ పై వ్యాపారాల కారణంగా పాదాచారులకు, వాహనదారులకు ఎన్నో రకాల ఇబ్బందులు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఫుట్ పాత్ పై వ్యాపారాలు చేసేవారిపై కొరడా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫుట్ పాత్ పై బోండాలు అమ్మవొద్దని చెప్పినందుకు కొంతమంది జీహెచ్ఎంసీ సిబ్బందిపై విచక్షణారహితంగా రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఫుట్ పాత్ పై బోండాలు అమ్మడం వల్ల పలువురు వాహనదారులు, పాదాచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని.. వాటిని వెంటనే తొలగించాలని చెప్పినందుకు జీహెచ్ఎంసీ సిబ్బందిపై రాళ్లతో దాడి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది. దాడి జరుగుతున్న సమయంలో సిబ్బందిలో ఒకరు వీడియో తీసి పోలీసులకు అందజేశారు. ఈ నేపథ్యంలో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కొబ్బరి బొండాల వ్యాపారి సహ ముగ్గురిని అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం జీహెచ్‌ఎంసీ సిబ్బంది క్లీనింగ్ కోసం రాజేంద్ర నగర్ లోని సులేమాన్ నగర్ కి వెళ్లారు. రహదారి పక్కనే ఉన్న ఫుట్ పాత్ పై చిరు వ్యాపారులను ఖాళీ చేయించారు.

ఓ వ్యాపారి ఫుట్ పాత్ పై కొబ్బరి బోండాలు అమ్ముతూ కనిపించాడు. వెంటనే సిబ్బంది అక్కడికి వెళ్లి ఖాళీచేయాల్సిందిగా కోరారు. దీంతో సిబ్బందిపై ఆ వ్యాపారి వాగ్వాదానికి దిగాడు. దీంతో సిబ్బంది అక్కడ ఉన్న కొబ్బరి బోండాలను వాహనంలో వేసే ప్రయత్నం చేశారు. హఠాత్తుగా ఇద్దరు యువకులు వచ్చి ఇటుకలతో సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని దాడికి పాల్పపడిన నలుగురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Show comments