iDreamPost
android-app
ios-app

Mahabubabad: దారుణం: ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి.. పరారీలో తల్లిదండ్రులు!

  • Published Mar 11, 2024 | 3:17 PM Updated Updated Mar 11, 2024 | 5:43 PM

కాలం మారుతున్న కొద్దీ.. రక్త సంబంధాలు కూడా కల్తీ అయిపోతున్నాయి. కన్న తల్లి తండ్రులే బిడ్డలను పొట్టన పెట్టుకుంటున్నారు. తాజాగా కన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు విషం ఇచ్చి.. పరారీ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాలం మారుతున్న కొద్దీ.. రక్త సంబంధాలు కూడా కల్తీ అయిపోతున్నాయి. కన్న తల్లి తండ్రులే బిడ్డలను పొట్టన పెట్టుకుంటున్నారు. తాజాగా కన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు విషం ఇచ్చి.. పరారీ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 11, 2024 | 3:17 PMUpdated Mar 11, 2024 | 5:43 PM
Mahabubabad: దారుణం: ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి.. పరారీలో తల్లిదండ్రులు!

కంటికి రెప్పలా తమ పిల్లలను కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు.. కాలం మారుతున్న కొద్దీ కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన తమ పిల్లలను మాత్రం ఎంతో గొప్పగా చూసుకోవాలని తల్లిదండ్రులు.. భావిస్తూ ఉంటారు. కానీ, కొంతమంది మాత్రం వారి పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కన్న మమకారం కూడా చూపించకుండా.. వారిని పొట్టన పెట్టుకుంటున్నారు. నవమాసాలు మోసిన కన్నతల్లి కూడా.. కనీసం కనికరం చూపించట్లేదు. పసి పిల్లలని కూడా చూడకుండా వారి పట్ల దయ చూపించడంలేదు. తాజాగా, ఇటువంటి ఓ సంఘటన అందరిని కలిచివేసింది. తమ కడుపున పుట్టిన ఇద్దరు కన్న బిడ్డలకు విషం ఇచ్చి.. తల్లిదండ్రులు పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అందరి హృదయాలను కలిచి వేసిన ఈ దుర్ఘటన .. మహబూబాబాద్ లోని.. గార్ల మండలం అంకన్న గూడెంలో చోటు చేసుకుంది. అనిల్ , దేవి అనే దంపతులు .. అంకన్న గూడెంలో నివసిస్తున్నారు. వీరికి రెండు సంవత్సరాల వయసు గల లాస్య , రెండు నెలల వయస్సు గల లోహిత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, వీరి మధ్య జరిగిన ఘర్షణల కారణంగా.. తమ కడుపున పుట్టిన ఇద్దరి పిల్లలను పొట్టన పెట్టుకున్నారు ఈ దంపతులు, కుటుంబ కలహాల కారణంగా తమ కన్న బిడ్డలకు విషాన్ని ఇచ్చి .. అనిల్, దేవి దంపతులు పరారయ్యారు. అభం శుభం తెలియని ఆ ఇద్దరు చిన్నారులు ఇప్పుడు విగత జీవులై పడి ఉన్నారు. దీని గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ దంపతుల గురించి .. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలను వెలికి తీస్తున్నారు పోలీసులు.

ఇప్పటివరకు కుటుంబ కలహాల కారణంగా .. పిల్లలను దారుణంగా హత్య చేసిన సంఘటనలను ఎన్నో చూసాము. సమాజంలో రోజు రోజుకి ఇలాంటి ఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. బయట వారినే కాకుండా కన్న తల్లిదండ్రులను కూడా నమ్మలేని దుస్థితికి .. పరిస్థితులు చేజారిపోతున్నాయి. కనీసం రక్తం పంచుకు పుట్టిన పసిపిల్లలని కూడా చూడకుండా .. ఆ ఇద్దరి తల్లిదండ్రులు అమానుషంగా ప్రవర్తించిన తీరు.. స్థానికంగా అందరి హృదయాలను కలచి వేసింది. ప్రస్తుతం ఈ దంపతుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మరి, ఈ హృదయ విదారక సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişgamdomCasibomjojobetJojobet Girişjojobet güncel giriş