Daji Shankar: 450 ఎకరాలు పేదలకు దానం చేసిన మహారాజు!

450 ఎకరాలు పేదలకు దానం చేసిన మహారాజు!

కోట్ల ఆస్తి, వందల ఎకరాలు భూములు ఉన్నా దానం చేసేందుకు చాలా మంది ఆలోచిస్తారు. అయితే చాలా తక్కువ మంది మాత్రం తమ కోసం కంటే ప్రజల కోసమే జీవిస్తారు. 450 ఎకరాలు పేదలకు దానం చేశారు ఓ మహారాజు.

కోట్ల ఆస్తి, వందల ఎకరాలు భూములు ఉన్నా దానం చేసేందుకు చాలా మంది ఆలోచిస్తారు. అయితే చాలా తక్కువ మంది మాత్రం తమ కోసం కంటే ప్రజల కోసమే జీవిస్తారు. 450 ఎకరాలు పేదలకు దానం చేశారు ఓ మహారాజు.

చాలా మంది కోట్ల ఆస్తి ఉన్నా కొంత మంది చిల్లి గవ్వ కూడా దానం చేసేందుకు ఆలోచిస్తారు. అంతేకాక మరికొందరు అయితే కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఇంకా కావాలని కోరుకుంటారు. ముఖ్యంగా నేటికాలంలో చాలా మంది ప్రజాప్రతినిధులు దోచుకోవడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారు. పదవి నుంచి దిగిపోయే లోపు ఎంత కూడబెట్టుకున్నామనేదే వారి టార్గెట్.  నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నేతలు చాలా తక్కువ మంది ఉంటారు. నమ్మిన సిద్ధాంతం, ఆశయాల కోసం ఊపిరిపోయో వరకు పోరాటం చేస్తుంటారు. అలాంటి వారు చరిత్రలో నిలిచిపోతుంటారు. ఆ జాబితాకు చెందిన వ్యక్తి దాజీ శంకర్. 450 ఎకరాల భూములను పేదలకు దానం చేసిన మహారాజు శంకర్. మరి.. ఆయన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన  దాజీ శంకర్ 1917లో జన్మించిచారు. ఆయన కార్యకలాపాలు, పోరాటాలు, ఉద్యమాలన్నీ తాంసి ప్రాంతంలోనే ఎక్కువగా కొనసాగాయి. నమ్మిన సిద్ధాంతం, ఆశయాల కోసం ఊపిరిపోయే వరకు పోరాటం చేశారు. అంతేకాక తన జీవితాన్ని, ఆస్తులను ప్రజలకు అంకితం చేసి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు. 1938లో కమ్యూనిస్ట్‌ పార్టీలో దాజీ శంకర్ చేరారు. 1946 నుంచి 1952 వరకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు.

అంతేకాక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 1952లో ఆదిలాబాద్‌ నియోజకవర్గానికి జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో పీడీఎఫ్‌ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆసిఫాబాద్‌కు చెందిన పైకాజీ రాంచందర్‌పై మంచి మెజార్టీతో శంకర్ గెలుపొందారు. 1952-1957 మధ్య ఆదిలాబాద్‌ అసెంబ్లీకి మొట్టమొదటి ఎమ్మెల్యేగా పని చేశారు. తన పదవీకాలంలో ఆదిలాబాద్‌లో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు కృషి చేశారు. ఆదిలాబాద్‌ను జిల్లా కేంద్రంగా మార్చడంలో దాజీ శంకర్ కీలకపాత్ర పోషించారు. దాజీ శంకర్‌ తండ్రి రాజేశ్వర్‌రావు పాఠశాల పంతులుగా పని చేశారు. అప్పట్లో వేతనానికి బదులు భూములను ఇనాంగా ఇచ్చేవారు.  అలా శంకర్ తండ్రికి భారీగా భూములు వచ్చాయి. అదిలాబాద్ జిల్లాలోని తాంసి, తలమడుగు, భీంపూర్‌ ప్రాంతాల్లో వారికి సుమారు 450 ఎకరాలకుపైగా భూములు ఉన్నాయి.

దున్నేవాడిదే భూమి అనే నినాదంతో ఆ 450 ఎకరాల భూములను దాజీ శంకర్ పేదలకు పంచారు. అంతటి ధనవంతుడైన శంకర్ చివరి రోజుల్లో సెంటు భూమి, సొంత ఇల్లు లేక అత్తగారింట్లో కాలం గడిపారు. 1986 నవంబరు 10న గుండెపోటుతో దాజీ శంకర్ మరణించారు. ఆయన భార్య గంగుబాయి 2002లో మరణించారు. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కోట్ల ఆస్తులు ఉన్నా కూడా చాలా మంది కొడుకు కోసం, మనవడి కోసం  ఇంకా ఆస్తులను కూడ పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి మనుషుల మధ్యలో దాజీ శంకర్ లాంటి మహారాజులు చాలా అరుదుగా ఉంటారు. మరి.. 450 ఎకరాలను తృణపాయంగా వదులుకున్న దాజీ శంకర్ గారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments