iDreamPost
android-app
ios-app

TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. వాట్సప్‌లోనే ఆ సేవలు

  • Published Jul 13, 2024 | 9:37 AM Updated Updated Jul 13, 2024 | 12:23 PM

TGSRTC-Ticket Booking, Whatsapp: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. ఇకపై వాట్సాప్‌లోనే ఆ సేవలు అందించేందుకు సిద్ధం అవుతోంది. ఆ వివరాలు..

TGSRTC-Ticket Booking, Whatsapp: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. ఇకపై వాట్సాప్‌లోనే ఆ సేవలు అందించేందుకు సిద్ధం అవుతోంది. ఆ వివరాలు..

  • Published Jul 13, 2024 | 9:37 AMUpdated Jul 13, 2024 | 12:23 PM
TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. వాట్సప్‌లోనే ఆ సేవలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం.. అనేక కార్యక్రమాలు, పథకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌  ప్రభుత్వం అమలు చేస్తోన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆర్టీసీలో రద్దీ పెరగడంతో పాటు.. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతోంది. అదలా ఉంచితే.. పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిల్లర సమస్యకు చెక్‌ పెట్టడం కోసం డిజిటల్‌ పేమెంట్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీజీఎస్‌ఆర్టీసీ మరో అడుగు ముందుకు వేసింది. ఇకపై వాట్సాప్‌లోనే ఆ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఆ వివరాలు..

ప్రస్తుతం నడిచేదంతా డిజిటల్‌ పేమెంట్స్‌నే. ఎక్కడ చూసినా ఆన్‌లైన్‌ చెల్లింపులు అందుబాటులోకి రావడంతో.. చాలా వరకు శ్రమ తప్పింది. పనులంతా ఆన్‌లైన్‌లోనే చక్కబెట్టుకునే అవకాశం ఉండటం.. వల్ల సమయం కలిసి వస్తుంది. ప్రయాణాలు మొదలు.. సినిమా టికెట్లు, ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ఇలా  ఎన్నో పనులను ఆన్‌లైన్‌ వేదికగా చక్కబెట్టుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలంటే.. క్యాబ్, ట్రైన్ ఇలా ఏదైనా సరే.. ఆన్‌లైన్‌లోనే టికెట్లు బుక్ చేసుకుని సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం లభించింది.

అయితే వాట్సప్‌లో కూడా టికెట్‌ బుకింగ్‌ అవకాశం అందుబాటులోకి వచ్చేసింది. ‌ఇప్పటికే హైదరాబాద్ మెట్రో టికెట్లు కూడా వాట్సప్‌లో బుక్ చేసుకునే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిని ఇతర రవాణా మార్గాలకు కూడా విస్తరించే దిశగా ఆలోచిస్తోంది మెటా. త్వరలోనే టీజీఎస్ఆర్టీసీ టికెట్స్ కూడా వాట్సప్ ద్వారా విక్రయించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దీనిపై మెటా బిజినెస్ మెసేజింగ్ ఇండియా డైరెక్టర్ రవి గార్గ్ ప్రకటన చేశారు.

చిరు వ్యాపారుల కోసం వాట్సాప్‌..

ఇదే సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) సంస్థలతో పాటుగా.. చిరు వ్యాపారుల కోసం వాట్సాప్‌ వినూత్నంగా ఆలోచించింది. ఆయా వర్గాలకు చెందిన వారు తమ వ్యాపారాల్ని ఆన్‌లైన్‌లో విస్తరించుకునే దిశగా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత సాంకేతికత ఏఐ ఏజెంట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వాట్సాప్‌ వెల్లడించింది. ఈ ఏడాది చివరికల్లా దీన్ని వాడుకలోకి తీసుకు వస్తామని చెప్పుకొచ్చింది. ఏఐ అసిస్టెంట్‌ను కూడా తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

పెద్ద పెద్ద సంస్థలు సొంతంగా యాప్స్, కృత్రిమ చాట్‌బాట్స్ నిర్వహిస్తాయి కానీ ఎంఎస్‌ఎంఈలకు మాత్రం ఆర్థిక వనరులు అంతంతమాత్రంగానే ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే వాట్సప్ స్మాల్ బిజినెస్ యాప్ తెచ్చినట్లు రవి గార్గ్ తెలిపారు. వాట్సప్ ప్లాట్‌ఫాం ద్వారా బిజినెస్ టు కన్జూమర్ (బీ2సీ) ట్రాన్సాక్షన్స్ సులభతరం చేసేందుకు ఏఐ ఏజెంట్ తోడ్పడుతుందని తెలిపారు.