తల్లిదండ్రులకు గుడి కట్టించిన కొడుకులు.. ఇది కదా ప్రేమంటే..

Sons Build Temple: ఈ మధ్య మానవ సంబంధాలు దారుణంగా మారిపోతున్నాయి. తల్లిదండ్రులు సంపాదించిన ప్రాపర్టీ గురించి ఆలోచించే పిల్లలు.. వారి బాగోగుల గురించి ఆలోచించడం లేదు. వృద్దాప్యంలో వృద్దాశ్రమాలకు పంపుతున్నారు.

Sons Build Temple: ఈ మధ్య మానవ సంబంధాలు దారుణంగా మారిపోతున్నాయి. తల్లిదండ్రులు సంపాదించిన ప్రాపర్టీ గురించి ఆలోచించే పిల్లలు.. వారి బాగోగుల గురించి ఆలోచించడం లేదు. వృద్దాప్యంలో వృద్దాశ్రమాలకు పంపుతున్నారు.

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి అంటారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు దైవస్వరూపులు అంటారు. కానీ ఈ మధ్య కాలంలో మానవ సంబంధాలు పూర్తిగా మంటకలిసిపోతున్నాయి.వృద్దాప్యంలో తమకు ఆసరగా ఉంటానుకుంటున్నకొడుకులు తల్లిదండ్రులను వృద్దాశ్రమాలకు పంపుతున్నారు. కనీసం అక్కడకి మందలించడానికి కూడా వెళ్లని ముర్ఖపు పుత్రరత్నాలు ఉన్నారు. పిల్లలు ఉన్నా.. కొంతమంది తల్లిదండ్రులు అనాథలుగా చనిపోతున్న దారుణమైన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అలాంటి ఈ రోజుల్లో కన్నతల్లిదండ్రులను దేవుళ్లుగా భావిస్తూ వారికి గుడి కట్టిస్తున్న పిల్లలు కూడా ఉన్నారు. తమ తల్లిదండ్రులకు గుడి కట్టించి పూజించి కుమారుల సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను దైవ స్వరూపంగా భావించారు.. దేవుడికి మాత్రమే కాదు.. తాము దైవంగా భావంచిన తమ తల్లిదండ్రులు కూడా తమకు దేవుళ్లే అంటూ అన్నదమ్ములు వారికి గుడి కట్టించారు. ఈ అపురూప ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను ఎంతో గొప్పగా చాటుకున్నారు ముగ్గురు కుమారులు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట గ్రామానికి చెందిన గొట్టె కనకయ్య, కొమరవ్వ దంపతులకు సదయ్య, మహేందర్, చిరంజీవి అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. వీరిలో సదయ్య, మహేందర్ గ్రామంలో ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. చిరంజీవి సిద్దిపేటలో ఓప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. వీరి తల్లిదండ్రులు ఇటీవల కన్నుమూశారు.  తమ తల్లిదండ్రుల జ్ఞాపకాలను మర్చిపోలేని కొడుకులు వారు సజీవంగా ఉండేలా చూడాలని అనుకున్నారు.. అందుకోసం వారికి గుడి కట్టించాలని భావించారు.

అనుకున్నదే తడవు.. కనకయ్య, కొమరవ్వలకు గుడి కట్టించేశారు. వారి వర్ధంతి వేడుకలను బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిపించారు. గుడిలో తల్లిదండ్రులకు పూజలు కూడా చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు కొడుకులు మాట్లాడుతూ.. తమకు జన్మనిచ్చి, తమ కోసం రాత్రి-పగలు అనే తేడా లేకుండా ఎంతో కష్టపడి తమకు ఆస్తులు అందించారు. వారి సుఖం కోసం ఏనాడూ ఆలోచించలేదు. అంత గొప్ప పుణ్యమూర్తులకు మేం జీవితాంతం రుణపడి ఉన్నాం.. అందుకే వారి జ్ఞాపకంగా గుడి కట్టించాం. ప్రతి పండుగ సంద్భంగా వారికి ఘనంగా పూజలు నిర్వహిస్తామని అన్నారు. కొడుకులు గొప్పతనం చూసి గ్రామస్థులు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show comments