P Krishna
Forgotten Sons of Humanity: ఆస్తి కోసం కొడుకు, కొడళ్లు మానవత్వం మరిచిపోయారు.. బతుకంతా పిల్లల కోసం కష్టపడి ఆస్తి కూడబెడితే.. ఆ ఆస్తికోసం మానవత్వం మరిచిపోయారు.
Forgotten Sons of Humanity: ఆస్తి కోసం కొడుకు, కొడళ్లు మానవత్వం మరిచిపోయారు.. బతుకంతా పిల్లల కోసం కష్టపడి ఆస్తి కూడబెడితే.. ఆ ఆస్తికోసం మానవత్వం మరిచిపోయారు.
P Krishna
ఇటీవల మానవ సంబంధాలు పూర్తిగా మంటకలిసిపోతున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆస్తి విషయంలో కనీ పెంచిన తల్లిదండ్రులను హింసలు గురి చేస్తున్నారు కన్నపిల్లలు. వృద్దాప్యంలో ఆదుకుంటారని కంటికి రెప్పలా సాకితే.. చివరి రోజుల్లో వృద్దాశ్రమాలకు సాగనంపుతున్నారు. మరికొంతమంది ఆస్తుల కోసం కన్నతల్లిదండ్రులను దారుణంగా చంపుతున్నారు. ఆస్తి కోసం కన్న తల్లికి అంత్యక్రియలు చేయకుండా కొట్టుకున్న కొడుకుల ఉదంతం సూర్యపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సూర్యపేట జిల్లా కందులవారి గూడెంలో లక్ష్మమ్మ అనే మహిళకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. ఓ కుమారుడు చాలా కాలం క్రితం కన్నుమూశాడు. ప్రస్తుతం లక్ష్మమ్మ కూతుళ్ల వద్దనే ఉంటుంది. పిల్లల కోసం లక్ష్మమ్మ ఎన్నో కష్టాలు పడి ఆస్తులు సంపాదించింది. ఇప్పుడు ఆ ఆస్తులే ఆమెకు శాపంగా మారాయి. కొద్దిరోజుల క్రితం లక్ష్మమ్మ ప్రమాద వశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం కన్నుమూసింది. తల్లి చనిపోయిందన్న బాధ లేకుండా కొడుకులు ఆస్తి పంపకాలు చేసే వరకు అంబులెన్స్ ని తరలించేది లేదని చెప్పారు.
లక్ష్మమ్మ వద్ద ఉన్న 21 లక్షల్లో ఆరు లక్షలు వైద్య ఖర్చులకు పోగా 15 లక్షలు కొడుకులు తీసుకున్నట్లు తెలుస్తుంది. మృతురాలి వద్ద ఉన్న 20 తులాల బంగారం ముగ్గురు కూతుళ్లు పంచుకున్నారు.. అయితే ఆస్తులు సరిగా పంచలేదని కొడుకులు తిరగబడ్డారు. ఆస్తి పంపకాలు జరిగే వరకు అంత్యక్రియలు జరిగేది లేదని కొర్రి పెట్టారు. దీంతో మూడు రోజులుగా లక్ష్మమ్మ మృతదేహం ఫ్రీజర్ లోనే ఉండిపోయింది. ఈ విషయం తెలిసిన బంధులు, చుట్టుపక్కల వాళ్లు కొడుకులను మందలించారు. ఆస్తికోసం కన్నతల్లి అంత్యక్రియలు జరపకుండా అడ్డుపడ్డ కొడుకులు, కూతుళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.