P Krishna
ఈ మధ్య కాలంలో వరుస రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రైలు బయలుదేరిన తర్వాత సాంకేతిక లోపాల కారణం, మనుషులు చేసే తప్పిదాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఈ మధ్య కాలంలో వరుస రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రైలు బయలుదేరిన తర్వాత సాంకేతిక లోపాల కారణం, మనుషులు చేసే తప్పిదాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
P Krishna
ఇటీవల దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు తీవ్ర అందోళన కలిగిస్తున్నాయి. ఏడాదిలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు క్షణాల వ్యవధిలో వరుసగా ఢీ కొన్న ఘటనలో 300 మంది చనిపోగా వెయ్యి మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. రైలు బయలు దేరిన తర్వాత సిగ్నల్ వద్ద టెక్నికల్ ఇబ్బందులు, సాంకేతిక లోపాలు, మనుషులు చేసే తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు. ఈ ఘటన యాదగిరి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
యాదగిరి భువనగిరి జిల్లాలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. యాదగిరిగుట్ట వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లో నుంచి ఉన్నట్టుండి పొగలు కమ్ముకున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే లోకో పైలెట్ అప్రమత్తమై వెంటనే ట్రైన్ ని ఆపి వేయడంతో ప్రయాణికులు బతుకు జీవుడా అనుకుంటూ పరుగులు పెట్టారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు ప్రయాణిస్తున్న ఈ ట్రైన్ వంగపల్లి వద్ద రాగానే పొగలు రావడం గుర్తించారు.
ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నట్టుండి పొగలు రావడానికి గల కారణం ఎయిర్ పైప్ పగిలిపోవడం వల్ల జరిగినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. సంఘటన జరిగిన వెంటనే ట్రైన్ ని కొద్దిసేపు వంగపల్లి వద్ద నిలిపివేయాల్సి వచ్చింది. రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది ఎయిర్ పైప్ కు మరమ్మత్తులు చేసి రైలును పునరుద్దరించి పంపించారు. రైలు నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో కొంతమంది ప్రయాణికులు భయపడి దూకి పారిపోయారు. అయితే ప్రమాదం ఏమీ జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.