iDreamPost
android-app
ios-app

రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతి లోపం.. గంటకు పైగా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులు, కొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా ఆ విమానంలో ఉన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులు, కొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా ఆ విమానంలో ఉన్నారు.

రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతి లోపం.. గంటకు పైగా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమాన సిబ్బంది నిలిపివేశారు. ఇదే విమానంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షి ఉన్నారు. వీరంతా శంషాబాద్‌ విమానాశ్రయంలో చిక్కకుపోయారు. ముంబయిలో జరిగే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు వీరంతా కలిసి విమానంలో బయలు దేరారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ నుండి ముంబయి బయలు దేరిన ఫ్లైట్ 6e 5099 ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

వెంటనే సాంకేతిక సమస్య తలెత్తడంతో.. శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే నిలిచిపోయింది. వెంటనే అక్కడకు చేరుకున్న టెక్నికల్ టీమ్ పరిశీలించి.. ఇంజిన్ ఐసీయులో సమస్య ఉన్నట్లు నిర్దారించారు. ఇంజన్ ఓవర్ హీట్ కావడంతో ఈ ఇష్యూ తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో గంటకు పైగా విమానంలో చిక్కుకుపోయారు రేవంత్‌, భట్టి, టీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షి. రిపేర్ చేసిన తర్వాత మళ్లీ టేకాఫ్ అయిన విమానం ముంబయికి వెళ్ళిపోయింది. విమానంలో మొదటి రోలోనే సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్నట్లు తెలుస్తోంది. దీంతో పెను ప్రమాదం నుండి వీరంతా తప్పించుకున్నట్లు అయ్యింది.

భారత్ జోడో యాత్రలో భాగంగా హాజరయ్యేందుకు సీఎంతో సహా  కాంగ్రెస్ నేతలంతా ఆదివారం ముంబయికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. అనంతరం ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా.. సాంకేతిక లోపం తలెత్తింది.  ఈ విషయాన్ని విమానంలో ప్రయాణిస్తున్న నేతలకు వెల్లడించారు. అనంతరం రిపేర్ చేయడంతో విమానం తిరిగి బయలు దేరింది. సుమారు గంటన్నర సేపు కాంగ్రెస్ విమానంలోనే పడిగాపులు పడాల్సి వచ్చింది.  ఇండిగో విమానంలో ఇలాంటి సమస్యలు తలెత్తడం కొత్తేమీ కాదూ..