iDreamPost
android-app
ios-app

బీటెక్ స్టూడెంట్ రేణుశ్రీ కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలలకే ఇలా!

  • Published Jan 05, 2024 | 6:47 PM Updated Updated Jan 06, 2024 | 6:03 AM

Hyderabad GITAM student Renu Sri: గీతం యూనివర్సిటీలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. అందరు చూస్తుండగానే ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ఆ వివరాలు మీకోసం..

Hyderabad GITAM student Renu Sri: గీతం యూనివర్సిటీలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. అందరు చూస్తుండగానే ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ఆ వివరాలు మీకోసం..

  • Published Jan 05, 2024 | 6:47 PMUpdated Jan 06, 2024 | 6:03 AM
బీటెక్ స్టూడెంట్ రేణుశ్రీ కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలలకే ఇలా!

ప్రతి సమస్యకు చావే మార్గం అనుకుంటే ఇక్కడ మిగిలే వాళ్లు ఎంతమంది. సమస్యల సుడిగుండంలో చిక్కుకుని మానసికంగా కుంగిపోయి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలిసి కూడా జీవితంపై విరక్తితో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు అప్పుల బాధతో, మరికొందరు ఆర్థిక, కుటుంబ సమస్యలతో విసిగిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రేమ విఫలమైనా, చదువులో రాణించలేకపోతున్నామనే ఆందోళనతో సూసైడ్ కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఆమె ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. కళాశాలలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. యూనివర్సిటీలో చేరిన మూడు నెలలకే రేణు శ్రీ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. అందరు చూస్తుండగానే కాలేజీ భవనం ఐదో అంతస్తు పైకి ఎక్కింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా అక్కడి నుంచి కిందికి దూకేసి ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినిని రేణు శ్రీ గా గుర్తించారు. గీతం కాలేజీలో డేస్ కాలర్ గా కాలేజీకి వెళ్తోందని సమాచారం. ఆమె గీతంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలుస్తోంది. కాగా మృతురాలు ప్రముఖ ఇండస్ట్రియల్ కి సబంధించిన వ్యక్తి కూతురు గా భావిస్తున్నారు. ఉదయం తన తల్లితో తనకు ఇష్టమైన చేపల కూర చేయమని చెప్పినట్లు తల్లి చెప్పింది.

కాలేజీకి వెళ్లిన కూతురు ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలిసి షాక్ గురైంది. అయితే రేణు శ్రీ ఆత్మహత్యకు ముందు ఓ ఫోన్ కాల్ మాట్లాడిందని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆ కాల్ తల్లిదండ్రులకు చేసిందా లేక మరెవరికైనా చేసిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదువు ఇష్టం లేకన లేక మరే ఇతర కారణాలతోనైనా ఆత్మహత్యకు పాల్పడిందా అనే విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆత్మహత్యకుపాల్పడిన విద్యార్థిని భవనంపై నుంచి దూకుతుండగా క్యాంపస్ లోని కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గీతం యూనివర్సిటీ అధికారులు ఘటన సమాచారాన్ని పోలీసులకు అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పటాన్ చెరువు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు సూసైడ్ చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom