iDreamPost
android-app
ios-app

ప్రశ్నాపత్రం రూపంలో పెళ్లి పత్రిక.. వావ్ అనాల్సిందే!

ఈ మధ్యకాలంలో చాలా మంది పెళ్లి వేడుకను తమ జీవితాంతం గుర్తుండి పోవాలని వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అందరూ వినూత్నంగా ఆలోచిస్తూ.. అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో చాలా మంది పెళ్లి వేడుకను తమ జీవితాంతం గుర్తుండి పోవాలని వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అందరూ వినూత్నంగా ఆలోచిస్తూ.. అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నారు.

ప్రశ్నాపత్రం రూపంలో పెళ్లి పత్రిక.. వావ్ అనాల్సిందే!

ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది ఓ మధురమైన జ్ఞాపకం. అందుకే పెళ్లిని ఎంతో గొప్పగా జరుపుకోవాలని యువత కోరుకుంటారు. అంతేకాక కొందరు అయితే తమ పెళ్లి.. వెరైటీగా ఉండాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్లే పెళ్లి కార్డులు మొదలు పెళ్లికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో ప్రత్యేకంగా, అందరిని ఆకట్టుకునేలా  ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య పెళ్లి పత్రికలను వినూత్నంగా తయారు చేయించండం ట్రెండ్ అవుతోంది. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువకుడు వెడ్డింగ్ కార్డుని విభిన్నంగా డిజైన్ చేయించాడు. ఆ కార్డును చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా కూడా పెళ్లి పత్రికను తయారు చేస్తారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వెరైటీ కార్డు ఏమిటి.. ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మెదక్ జిల్లా కడ్లూర్  గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే అతనికి ఇటీవలే అక్షర అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. నవంబర్  19న సిద్దిపేటలో వీరిద్దరి పెళ్లి జరగనుంది. అయితే తన పెళ్లి కార్డు ప్రత్యేకంగా, అందరూ గుర్తుంచుకునేలా ఉండాలని అనిల్ భావించాడు. అందుకే పెళ్లి కార్డును ప్రశ్నా పత్రం రూపంలో రూపొందించాడు. ఆ పెళ్లి కార్డును ప్రశ్నల రూపంలో ఇచ్చి ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. అలాగే సరైన సమాధానం ఎంపిక చేసుకోవాలంటూ పలు విభాగాల్లో ప్రశ్నలు రూపొందించాడు. ట్రూ ఆర్ ఫాల్స్,  చూస్ ది కరెక్ట్ ఆన్సర్ అనే విధంగా కార్డును ప్రింట్ చేయించాడు. ఇంకా చెప్పాలంటే పోటీ పరీక్షల ప్రశ్నల మాదిరిగా పత్రికను అచ్చు వేయించాడు. అందులో ” ఐడెంటీఫై ది పర్సన్ ఇన్ ది ఫిచర్” అంటూ నాలుగు ఆప్షన్లు ఇచ్చి.. సరైన సమాధానాన్ని హైలెట్ చేశాడు.

Veraity wedding card

అదే విధంగా ‘మ్యాచ్ ది ఫాలోయింగ్ విత్ థేయిర్ ఫెయిర్స్’ అంటూ వివాహానికి ఆహ్వానిస్తున్న జంటల పేర్లను రాసి, భార్య భర్తల జంటలను కలపాలని కోరాడు. వాటితోపాటు “పెళ్లి సమయం, పెళ్లి జరిగే ప్రదేశం, పెళ్లి మండపం ఇలా… మొత్తంగా 5 విభాగాల్లో సుమారు 20 వరకు ప్రశ్నలు వేసి.. చూపరులకు ఆసక్తికలిగేలా చేశాడు. మొత్తానికి అనిల్ తన పెళ్లి కార్డును ఓ ప్రశ్న పత్రంగా మార్చేశాడు. అంతేకాకుండా పెళ్లికార్డు టాప్ లో వందకు వంద మార్కులు కూడా  ఉంటాయన్నట్లు  అందులో చూపించాడు. ప్రస్తుతం ఈ  వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో  తెగ వైరల్  అవుతోంది. దీంతో దానిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్ది ఇంకా  ఎలాంటి కార్డులు వస్తాయో అని చర్చించుకుంటున్నారు.