iDreamPost
android-app
ios-app

తాళం వేసి ఉపాధ్యాయుడ్ని క్లాస్ రూమ్‌లో బంధించిన విద్యార్థులు.. ఎందుకంటే?

  • Published Jun 29, 2024 | 4:30 PM Updated Updated Jun 29, 2024 | 4:30 PM

Students Locked Up The Master: ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడ్ని కొంతమంది విద్యార్థులు తాళం వేసి క్లాస్ రూమ్ లో బంధించారు. ఎందుకో తెలిస్తే మీరు ఆ విద్యార్థులను మెచ్చుకోకుండా ఉండలేరు. అసలు ఆ ఉపాధ్యాయుడు చేసిన పనేంటో తెలుసా?

Students Locked Up The Master: ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడ్ని కొంతమంది విద్యార్థులు తాళం వేసి క్లాస్ రూమ్ లో బంధించారు. ఎందుకో తెలిస్తే మీరు ఆ విద్యార్థులను మెచ్చుకోకుండా ఉండలేరు. అసలు ఆ ఉపాధ్యాయుడు చేసిన పనేంటో తెలుసా?

తాళం వేసి ఉపాధ్యాయుడ్ని క్లాస్ రూమ్‌లో బంధించిన విద్యార్థులు.. ఎందుకంటే?

విద్యార్థులు అంటేనే అల్లరి. అది వారి వయసు ప్రభావం. ఆ అల్లరి శృతి మించితే పాఠాలు చెప్పే గురువుల మీద దాడులకు పాల్పడతారు. ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేశారనో.. చదవడం లేదని కొడితేనో వారి మీద విద్యార్థులు రివేంజ్ తీర్చుకుంటూ ఉంటారు. ఇది మాస్టర్ సినిమా నుంచి వస్తున్నదే. అంతకు ముందు కూడా ఉంది. అల్లరి చేయద్దు.. చదువుకోండి అని చెప్తే విద్యార్ధులకు నచ్చదు. కొన్ని ఏళ్లుగా గురువుకి, విద్యార్థికి మధ్య వైరం అనేది ఒక వైరస్ లా వ్యాపించింది. ఒకప్పుడు కాలేజ్ కి వెళ్లే యువకులకి ఉంటే.. ఇప్పుడు ఆ వైరస్ స్కూల్ పిల్లలకి కూడా వ్యాపించింది. చిన్న మాట అన్నా కూడా తట్టుకోలేకపోతున్నారు. బెత్తం దెబ్బలు తింటే ఫ్యూచర్ లో లాఠీ దెబ్బలు తినే పరిస్థితి రాదని అనేవారు.

సరిగా చదవకపోతే టీచర్లు కొట్టేవారు. అప్పుడు టీచర్లు కొట్టకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు వారి మీద కంప్లైంట్ చేసేవారు.. నాలుగు తగిలించైనా పిల్లల్ని గాడిలో పెట్టండి అని. మరి ఇప్పుడో టీచర్లు చిన్న దెబ్బ వేస్తేనే కేసు పెడుతున్నారు. ఎంతలా డెవలప్ అయిపోయిందో ఈ ఆడు సమాజం. కొంతమంది టీచర్లు అయితే గురువుకి ఉన్న విలువలు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తాగి పాఠశాలకు వస్తున్నారు. పిల్లలు తప్పు చేస్తే దాన్ని సరి చేయాల్సిన బాధ్యత కలిగిన హోదాలో ఉన్న టీచర్లే ఇలా చేస్తే ఇక పిల్లల పరిస్థితి ఏంటి? అయితే ఇప్పుడు చెప్పుకోబోయే పిల్లలు మాత్రం అందరికీ భిన్నం.

మాస్టర్ ని క్లాస్ రూమ్ లో తాళం వేసి బంధించారని ఆ స్టూడెంట్స్ ని చెడ్డవాళ్ళని అనుకోకండి. ఈ స్టూడెంట్స్ చేసిన పని తెలిస్తే శభాష్ అంటారు. ఆ మాస్టర్ చేసిన పని తెలిస్తే ఛీ అంటారు. ఆ మాస్టర్ రోజూ మద్యం తాగి స్కూల్ కి వెళ్తున్నాడని విద్యార్థులు ఇలా చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆ విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. తాము ఈ స్కూల్లో ఉన్నప్పటి నుంచి సార్ రోజూ తాగుతున్నాడని.. రోజూ స్కూల్ కి తాగి వస్తున్నాడని అన్నారు. ఎప్పుడు చూసినా తిడతా ఉంటాడని.. తాగొచ్చి గోల గోల చేస్తాడని.. నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడని చెప్పుకొచ్చారు. ఆయమ్మని, అమ్మాయిలను కూడా బూతులు తిడతాడని.. తమని కూడా బూతులు తిడతాడని అన్నారు. అందుకే గదిలో బంధించి తాళం వేశామని విద్యార్థులు వెల్లడించారు. మరి విద్యార్థులంటే అల్లరి చిల్లరగా ఉంటారన్న అభిప్రాయాన్ని మార్చేసి సరికొత్త నిర్వచనం ఇచ్చిన ఈ విద్యార్థులపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.