Arjun Suravaram
నేటికాలంలో రేషన్ కార్డు అనేది ఎంతో ముఖ్యంగా. ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలకు సంబంధించిన కొన్ని పనుల విషయంలో రేషన్ కార్డు అవసర పడుతుంది. తాజాగా రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన వారికి ఒక అదిరే గుడ్ న్యూస్.
నేటికాలంలో రేషన్ కార్డు అనేది ఎంతో ముఖ్యంగా. ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలకు సంబంధించిన కొన్ని పనుల విషయంలో రేషన్ కార్డు అవసర పడుతుంది. తాజాగా రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన వారికి ఒక అదిరే గుడ్ న్యూస్.
Arjun Suravaram
నేటికాలంలో చాలా మంది యువత ఉద్యోగం కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక చిన్న ఉద్యోగం వచ్చిన చాలు అనే భావనలో కొందరు ఉంటే, మంచి జీతంతో కూడిన జాబ్ కావాలని మరికొందరు ఉంటారు. ఇలాంటి సమయంలోనే కొన్ని కొన్ని బ్యాంకులు, ఇతర సంస్థలు అదిరిపోయే శుభవార్తలు చెబుతుంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే యువతకు మంచి అవకాశాలను కల్పిస్తుంటాయి. తాజాగా రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన వారికి అదిరే శుభవార్త ఒకటి ఉంది. కేవలం రేషన్ కార్డు ఉంటే.. మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఉద్యోగం కోసం ఎందురు చూస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్. ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రధానమైన వాటిల్లో ఒక్కటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగ యువతకు ఎస్బీఐ ఈ సమ్మర్ కి జాబ్ లేదా ఉపాధి పొందే అవకాశం కల్పించింది. గ్రామీణ ప్రాంతంలో ఉండే పురుషులకు ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్‌లో ట్రైనింగ్ అందిస్తోంది. వేసవి కాలం సందర్భంగా నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఉంటుంది.
ఏప్రిల్ 18న ప్రారంభమై.. కొనసాగుతూనే ఉంది. అయితే ఇది సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉండే వారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. ఈ రెండు జిల్లాల పరిధిలోని గ్రామీణ పురుషులకు ఈ అవకాశం ఉంటుంది. వారి వయస్సు 18 నుంచి 45 మధ్య ఉండాలి. ఇక రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ శిక్షణ సమయంలో ఉచిత భోజన , వసతి సౌకర్యంగా కల్పిస్తుంది. అలానే ఉచితంగా యూనిఫామ్ ఇచ్చి..ట్రైనింగ్ ఇస్తామని ,శిక్షణ అనంతరం సర్టిఫికెట్ తో అందిస్తారు. అలానే ట్రైనింగ్ అనంతరం టూల్ కిట్ ఉచితంగా ఇస్తామని SBRSETI డైరెక్టర్ వంగా రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
అయితే శిక్షణకు దరఖాస్తు చేసుకునే వారు కొన్ని కీలక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, పదో తరగతి మెమో జిరాక్స్, అలానే నాలుగు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అలానే పదో తరగతి చదవిని వారు కూడా ఈ ట్రైనింగ్ లో పాల్గొనవచ్చు. కాగా పూర్తి వివరాలకు 9490103390, 9490129839 నెంబర్లకు కాల్ చేయొచ్చు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు సంప్రదించగలరు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతంలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.