iDreamPost
android-app
ios-app

13 ఏళ్లుగా మృత్యు శకటంలా వెంబడించిన 108 అంబులెన్స్.. చివరకు

ప్రమాదాల నుండి కాపాడే 108 అంబులెన్స్.. ఆమె పాలిట మాత్రం మృత్యు శకటం అయ్యింది. అదే అంబులెన్స్ లో ఎంతో మంది పురుడు పోసి.. అవార్డులు, మెప్పులు పొందిన ఆమె చివరకు

ప్రమాదాల నుండి కాపాడే 108 అంబులెన్స్.. ఆమె పాలిట మాత్రం మృత్యు శకటం అయ్యింది. అదే అంబులెన్స్ లో ఎంతో మంది పురుడు పోసి.. అవార్డులు, మెప్పులు పొందిన ఆమె చివరకు

13 ఏళ్లుగా మృత్యు శకటంలా వెంబడించిన 108 అంబులెన్స్.. చివరకు

రోడ్డు మీద ఎవరికైనా ప్రమాదం జరిగితే.. వెంటనే గుర్తుకు వచ్చేది.. 108 నంబర్. వెంటనే 108 డయల్ చేసి అంబులెన్స్‌కు కాల్ చేస్తారు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకు వచ్చిన ఈ వాహనం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది. ప్రమాదాలకు గురైన క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి.. చావు నుండి తప్పించి ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపింది. అదేవిధంగా ప్రసవాలు కూడా చేసి.. తల్లి, బిడ్డలను రక్షించింది. చాలా మంది జీవితాల్లో సెకండ్ లైఫ్ ఇచ్చిన 108 అంబులెన్స్ ఆమె విషయంలో మాత్రం మృత్యు శకటంగా మారింది. ఒకటా రెండా.. ఆమెను 13 సంవత్సరాల నుండి మృత్యువు రూపంలో వెంబడిస్తూనే ఉంది. చివరకు ఇదే అంబులెన్స్  ఆ ప్రాణాలు తీసింది. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. 2007లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ 108 వాహనాలను ప్రారంభించిన కొత్తలో.. అందులో ఎమర్జెన్నీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ)గా జాయిన్ అయ్యారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాలకు చెందిన సూదమళ్ల స్వప్న. విధుల్లో చురుగ్గా ఉండటంతో ఆమెకు ప్రశంసలతో పాటు అవార్డులు అందుకుంది. 108 వాహనంలో 108 ప్రసవాలు చేసి రికార్డు సృష్టించింది స్వప్న. అయితే 2010లో 108 వాహనంలో కేయూసీ పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా.. ప్రమాదం జరిగిందన్న సమాచారంతో ఘటనాస్థలానికి వాహనంతో పాటు బయలుదేరింది బృందం. ఆ సమయంలో హసన్ పర్తి రోడ్డులో 108 వాహనానికి ప్రమాదం జరగడంతో.. స్వప్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు హైదరాబాద్‌ ఆసుపత్రిలో చేర్పించారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో.. ఆపరేషన్లు చేశారు.

పూర్తిగా కోలుకోలేపోయినప్పటికీ.. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యానికి అయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని మళ్లీ విధుల్లో చేరింది స్వప్న. కరోనా సమయంలో కూడా ఉత్సాహంగా పనిచేసింది ఆమె. అంతలో మరో ప్రమాదం. 2021లో పరకాలలో 108 వాహనంలో పనిచేస్తున్న ఆమె.. ఓ క్షతగాడ్రుడిని ఎంజీఎంకు అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. మళ్లీ ప్రమాదానికి గురైంది 108 వాహనం. ఆ ఉద్యోగిని మరోసారి ఆసుపత్రికి పాలయ్యింది. నాటి నుండి ఆమె మంచానికే పరిమితమైంది. స్వప్న ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో.. సాటి ఉద్యోగులు కొంత ఆర్థిక సాయం చేశారు. దీంతో తాను పనిచేసిన అదే వాహనంలో హైదరాబాద్ ఆసుపత్రికి చేరింది. అక్కడ వైద్యులు ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. ఆదివారం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.