Venkateswarlu
Venkateswarlu
మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. రోడ్డుపై కాలినడకన ఇంటికి వెళుతున్న చిన్న పిల్లలను చూసి ఆమె చలించిపోయారు. వారి కోసం కాన్వాయ్ ఆపి మరీ, తన కారులో లిఫ్ట్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం మండలం గొల్లూరు నుంచి పెద్ద గోల్కొండ ఓఆర్‌ఆర్ వైపు కాన్వాయ్‌లో వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇద్దరు చిన్నారులు స్కూలు నుండి ఇంటికి నడుస్తూ ఉన్నారు. వారు రోడ్డుపై నడుస్తూ వెళుతూ ఉండగా.. మంత్రి సబిత వారిని చూశారు. వారిని చూడగానే కారును ఆపాలని ఆమె డ్రైవర్‌ను ఆదేశించారు. దీంతో కాన్వాయ్ మొత్తం రోడ్డుపై ఆగిపోయింది.
తర్వాత పిల్లలను కారు దగ్గరకు పిలిపించారు. కారులోంచే ఆమె చిన్నారులతో మాట్లాడారు. వారు ఇంటికి వెళుతున్నాం అని చెప్పారు. అప్పుడు మంత్రి ‘నాతో పాటు కారులో వస్తారా?’ అని అడిగారు. వారు సంతోషంగా వస్తామని అన్నారు. దీంతో మంత్రి వారిని తన కారులో ఎక్కించుకున్నారు. కారులోనే వారిని ఇంటి వద్ద దింపారు. బాగా చదువుకుని ఉన్నత స్థితిలోకి రావాలని వారికి చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, స్కూలు పిల్లలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి లిఫ్ట్ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.