రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లో రూ.1.50 లక్షలు

రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లో రూ.1.50 లక్షలు

Telangana Govt: అన్నదాత విషయంలో తెలంగాణ సర్కార్ గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటుంది. ఎన్నికల సమయంలో రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అన్నమాట ప్రకారం నిధువుల విడుదల చేస్తుంది.

Telangana Govt: అన్నదాత విషయంలో తెలంగాణ సర్కార్ గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటుంది. ఎన్నికల సమయంలో రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అన్నమాట ప్రకారం నిధువుల విడుదల చేస్తుంది.

తెలంగాణలో రైతులకు వరుసగా గుడ్ న్యూస్ అందిస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఆగస్టు 15 నాటికి రెండు లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామన్ని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని నేరెవేర్చేందుకు అడుగులు వేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం.. ఈ నెల 18న తొలి విడత రుణమాఫీ అమలు చేశారు. లక్ష‌లోపు రుణాలు తీసున్న రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారు. తొలి విడుతలో దాదాపు 11 లక్షల మందికి రైతులకు 6 వేల కోట్ల నిధులు విడుదల చేశారు. ఇప్పుడు మలివిడత నిధులు విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది రేవంత్ సర్కార్. ఈ క్రమంలోనే రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఈ నెల 18న తొలి విడత రుణమాఫీని అమలు చేసిన విషయం తెలిసిందే. మరో రెండు విడతల్లో రెండు లక్షల వరకు రుణాల మాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. లక్షన్నర లోపు రెండో విడతలో.. లక్షన్నర నుంచి 2 లక్షల వరకు మూడో విడతలో రుణమాఫీ చేయననున్నట్లు ఇటీవల ప్రకపటించింది. ఈ క్రమంలోనే రెండో విడత రుణమాఫీ గురించి రైతులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. తాజాగా రెండో విడతకు సిద్దమైంది ప్రభుత్వం. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే విషయమై ఆర్థిక శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రేపు లక్షన్నర లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు పడతాయియని వార్తలు వస్తున్నాయి.

జులై 31లోపే రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించగా.. తాజాగా తేదీ ఫిక్స్ అయింది. రేపు (జులై 30) రెండో విడత రైతు రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రెండో విడతలో లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి రైతుల అకౌంట్లలోకి నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం రైతు రుణమాఫీపై అసెంబ్లీలో చర్చ పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. రేపు సభలో రుణమాఫీ పై తెలంగాణ ప్రభుత్వం చర్చ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Show comments