ఘోరం.. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు.. అంతలోనే..

హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువకుడు విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది.

హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువకుడు విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది.

ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. చిన్న పొరపాట్ల వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అప్పటి వరకు తమతో ఉన్న వారు ప్రమాదాల్లో మరణించడంతో కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంటోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసింది. అతడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. భవిష్యత్తుపై ఎన్నో కలలుకన్నాడు. విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. కానీ విధి వక్రీకరించింది. ఆ కుటుంబంలో విషాదం నింపింది. విదేశాలకు వెళ్లాలనుకున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మేడిపల్లి సత్యనారాయణ పురంనకు చెందిన దొంతురి మధుసూదన్ రెడ్డి, సుష్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వర్షిత్ (23). ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో బైక్ మీద ఇంటి దగ్గర నుంచి హిమాయత్ నగర్‌కు బ్యాంకు పని మీద బయలుదేరాడు. అలా వెళ్తున్న క్రమంలో ఉప్పల్ నల్లచెరువు కట్ట మైసమ్మ ఆలయం దగ్గరికి చేరుకోగానే బైక్ స్కిడ్ అయింది. దీంతో అతడు రోడ్డుమీద పడిపోయాడు. ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు తల మీద నుంచి వెళ్ళింది. దీంతో తీవ్ర గాయాలపాలైన వర్షిత్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ సమాచారం తెలియగానే తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఘటనాస్థలికి చేరుకుని కుమారుడి మృతదేహం చూసి బోరున విలపించారు. చేతికి అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింంది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.

Show comments