iDreamPost
android-app
ios-app

500కే గ్యాస్.. ఉచిత కరెంట్.. వారంల్లో అమలు!

  • Published Feb 21, 2024 | 10:05 PM Updated Updated Feb 21, 2024 | 10:05 PM

Rs 500 Gas Cylinder and Electricity Scheme: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు కృషి చేస్తున్నారు.

Rs 500 Gas Cylinder and Electricity Scheme: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు కృషి చేస్తున్నారు.

  • Published Feb 21, 2024 | 10:05 PMUpdated Feb 21, 2024 | 10:05 PM
500కే గ్యాస్.. ఉచిత కరెంట్.. వారంల్లో అమలు!

తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాలు మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. త్వరలో మిగిలిన గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఆరు గ్యారెంటీల పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభవార్త చెప్పారు. వారం రోజుల్లోనే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారిగా ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ది పనులకు శంకు స్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ మంది లబ్ది చేకూరే పథకాలకు తొలి ప్రాదాన్యత ఇస్తుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మార్చి 15న రైతు బంధు, రైతు బరోసా అమలు చేస్తామని తెలిపారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం నేను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రెండు పథకాలు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టినట్టు తెలిపారు.