తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ లో ఆర్థిక మంత్రి కీలక ప్రకటన!

Telangana: ఇటీవలే పంట రుణమాఫీ చేసి.. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరో తీపికబురు అందించింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క్ రైతులకు తీపి కబురు చెప్పారు.

Telangana: ఇటీవలే పంట రుణమాఫీ చేసి.. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరో తీపికబురు అందించింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క్ రైతులకు తీపి కబురు చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే వారికి పంట రుణమాఫీ చేసిన సంగతి తెలిసింది. తొలుత రూ. లక్ష లోపు ఉన్నవారికి సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారు. అలానే రూ.లక్షన్నర లోపు ఉండే వాటిని ఈనెల చివర్లలోపు చేస్తామని తెలిపాడు. అలానే ఆగష్టులోపు మొత్తం రైతు రుణమాఫీ చేస్తామని తెలిపాడు. తాజాగా మరోసారి రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  గురువారం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే  రైతులకు శుభవార్త చెప్పారు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వివరాల్లోకి వెళ్తే…

గురువారం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రైతు పక్షపాతి ప్రభుత్వంగా.. వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చే ఆలోచనతో పలు రకాలు సంక్షేమ పథకాలు ప్రకటించారు. ముఖ్యంగా వరి పడించే రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. వరికి బోనస్ ను ప్రకటిస్తూ ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. సన్నరకం వరి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 33 రకాల వరిధాన్యాలను గుర్తించింది. అవి పండించిన రైతులకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

దీనివల్ల సాగు విస్తీర్ణం పెరిగి అన్నదాతలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని వెల్లడించారు. దీని ద్వారా వరి పంటను లాభసాటిగా మార్చటం జరుగుతుందన్నారు. సన్న రకం వరి ధాన్యాలను పండించే రైతులకు ఆర్థిక ప్రయోజనంగా ఉంటుందన్నారు. ఇదే సమయంలో భూమిలేని రైతుల కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ స్కీమ్ ను ఈ సంవత్సరం నుంచే అమలు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయల ఆర్థిక సాయం అందించటం ద్వారా.. వాళ్ల జీవితాల్లో వెలుగు తీసుకువస్తున్నట్లు వెల్లడించారాయన. మరీ.. తెలంగాణ ప్రభుత్వం వరి పంటకు బోనస్ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments