iDreamPost
android-app
ios-app

రూ. 2కే హైదరాబాద్ బిర్యానీ..రూ. లక్ష గెలిచే ఛాన్స్ కూడా.. ఎక్కడంటే..?

  • Published Dec 11, 2023 | 12:22 PM Updated Updated Dec 11, 2023 | 1:08 PM

బిర్యానీ అంటే పెద్దలే కాదూ పిల్లలు సైతం ఇష్టపడుతుంటారు. బిర్యానీ చేస్తే మారం చేయకుండా తింటుంటారు. వీకెండ్ వస్తుందంటే చాలు.. కుటుంబమంతా కలిసి రెస్టారెంట్లకు వెళ్లి.. ముందుగా ఆర్డర్ చేసేదీ బిర్యానీనే. అలాంటి బిర్యానీ ప్రియుల కోసం ఓ ఆఫర్ ఇస్తోంది ప్రముఖ రెస్టారెంట్.

బిర్యానీ అంటే పెద్దలే కాదూ పిల్లలు సైతం ఇష్టపడుతుంటారు. బిర్యానీ చేస్తే మారం చేయకుండా తింటుంటారు. వీకెండ్ వస్తుందంటే చాలు.. కుటుంబమంతా కలిసి రెస్టారెంట్లకు వెళ్లి.. ముందుగా ఆర్డర్ చేసేదీ బిర్యానీనే. అలాంటి బిర్యానీ ప్రియుల కోసం ఓ ఆఫర్ ఇస్తోంది ప్రముఖ రెస్టారెంట్.

  • Published Dec 11, 2023 | 12:22 PMUpdated Dec 11, 2023 | 1:08 PM
రూ. 2కే హైదరాబాద్ బిర్యానీ..రూ. లక్ష గెలిచే ఛాన్స్ కూడా.. ఎక్కడంటే..?

బిర్యానీని ఇష్టపడని వారు ఉండరు. రోజూ వండిపెట్టాలే కానీ లొట్టలేసుకుని తినే పిల్లలు ఉన్నారు. వీకెండ్‌ తో సంబంధం లేకుండా ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇంట్లో వండించుకుని లాగించేస్తుంటారు. అయితే రెస్టారెంట్లలో తిన్న మజా.. ఇంట్లో రాదుగా. అందుకే కొంతమంది రెస్టారెంట్లకు వెళ్లి లొట్టలేసుకుంటూ ఆరగిస్తారు. ప్రముఖ రెస్టారెంట్లు, హోటల్స్ లిస్టు ఒకటి తయారు చేసుకుని.. సెమీ ఫైనల్‌లో రెండు అనుకుని.. ఫైనల్‌గా ఒకటి ఫిక్స్ అయ్యి వెళ్తారు. బిర్యానీ బాగుంటుంది కానీ బిల్లే బాధపెడుతోంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా బాధపడేవారి కోసమే ఈ అద్భుతమైన ఆఫర్. కేవలం రెండంటే రెండు రూపాయలకు బిర్యానీ ఇస్తానంటోంది ఓ రెస్టారెంట్. ఏంటి రెండు రూపాయలకి.. బిర్యానీనా? అని ఆశ్చర్యపోకండి. అందుకు ఓ షరతు కూడా ఉందండి.

ఇంతకు ఎక్కడ అనుకుంటున్నారా..?  ‘నాయుడు గారి కుండ బిర్యానీ’ అనే రెస్టారెంట్ ఈ బంఫర్  ఆఫర్ ప్రకటించింది. కేవలం రెండు రూపాయలకే బిర్యానీ అందిస్తుంది. అయితే ఇక్కడో కండిషన్ ఉందండోయ్. అదేంటంటే.. కేవలం రూ. 2 నోటు ఇస్తేనే బిర్యానీ ఇస్తారు. అది కూడా ఒక్కరికే. దిల్‌సుఖ్‌నగర్, గచ్చిబౌలి, కేపీహెచ్‌బీ బ్రాంచ్‌లలో మాత్రమే ఈ ఆఫర్ నడుస్తోంది. అసలు ఈ వినూత్న ఆఫర్ పెట్టేందుకు రీజన్ ఏంటంటే.. ప్రజల దగ్గర రూ.2 నోట్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికట. ఈ కిర్రాక్ ఆఫర్ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 120 రెండు రూపాయల నోట్లు వచ్చాయట. దీనికి మంచి స్పందన రావడంతో కంటిన్యూ చేస్తున్నట్లు దీని యజమాని మనోహర్ చెబుతున్నారు.

hyderabad biryani only 2 rs

నాన్ వెజ్ బిర్యానీనే కాదు.. వెజ్ ప్రియుల కోసం వెజ్ బిర్యానీ ఆఫర్ కూడా ఉంది. అంతేకాదు.. ఒక కాంటెస్ట్ కూడా నిర్వహిస్తోంది రెస్టారెంట్ యాజమాన్యం. ఈ కాంటెస్ట్ లో గెలిస్తే.. రూ. 1 లక్ష బంపర్ ప్రైజ్ ఇవ్వనుంది. కేవలం 30 నిమిషాల్లో 30 కంటే ఎక్కువ ఆహార పదార్థాలు ఉండే బాహుబలి థాలీని పూర్తి చేస్తే చాలు లక్ష రూపాయలు గెలుచుకోవచ్చు. ఈ థాలీలో చికెన్ బిర్యానీ, రొయ్యల కూర, సలాడ్, రైతా, షెజ్వాన్ నూడుల్స్, శాకాహార, మాంసాహార వంటలు, ఓ డ్రింక్ ఉంటాయి. ఈ థాలీ ధర రూ.1,999. ఇది మొత్తం లాగించేస్తే.. రూ. లక్ష రూపాయలు మీవే. ఇప్పటికీ ఈ ఆఫర్ అందుబాటులోనే ఉంది. మరి 2 రూపాయల నోటు పట్టుకెళ్లి 2 రూపాయలకే బిర్యానీ లాగించేయండి. అలానే మీరు బాహుబలిలా 30 నిమిషాల్లో 30 రకాల ఫుడ్ ఐటమ్స్ లాగించేసి లక్ష రూపాయలు గెలుచుకోండి. ఈ ఆఫర్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేసేసుకోండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom