Arjun Suravaram
Telangana Flood Victims: ఇటీవల కురిసిన వానలకు తెలంగాణలోని పలు ప్రాంతాలు చిగురుటాకుల వణికిపోయాయి. అంతేకాక మున్నేరు నది ప్రళయానికి ఖమ్మం పట్టణంలోని సగం ప్రాంతం తుడిచిపెట్టుకుపోయింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది.
Telangana Flood Victims: ఇటీవల కురిసిన వానలకు తెలంగాణలోని పలు ప్రాంతాలు చిగురుటాకుల వణికిపోయాయి. అంతేకాక మున్నేరు నది ప్రళయానికి ఖమ్మం పట్టణంలోని సగం ప్రాంతం తుడిచిపెట్టుకుపోయింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది.
Arjun Suravaram
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు కురిసిన సంగతి తెలిసింది. ఈ వర్షాల ధాటికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు చిగురుటాకుల వణికాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, వరంగల్,నల్గొండ జిల్లాలు, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలు వరదలకు గురయ్యాయి. ఈ క్రమంలో మున్నేరు వాగు కారణంగా ఖమ్మం, బుడమేరు వాగ కారణం విజయవాడ వరద ముంపు గురయ్యారు. ఖమ్మంలోని సగంపట్టణం మున్నేరు నది ఉద్ధృతిలో కొట్టుకుపోయింది. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే వారికి కాస్తా ఊరట నిచ్చే ఓ న్యూస్ ను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. రేపటి నుంచి వరద బాధితల అకౌంట్లలో రూ.10వేలు జమ చేస్తామని ప్రకటించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో వరదకు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు కాస్తా ఊరట నిచ్చే విషయాన్ని మంత్రి తెలిపారు. రేపటి నుంచి వరద బాధితుల ఖాతాల్లో రూ.10వేల నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. అదే విధంగా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గత వందేళ్లలో ఎన్నడూ ఇలాంటి వరదలు చూడలేదన్నారు. వ్యాధులు వ్యాపించకుండా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పది వైద్య బృందాలు రంగంలోకి దిగి ఇంటింటి సర్వే చేస్తున్నామని తెలిపారు. అంతేకాక వరద బాధితులను ఆదుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిచరాదని తెలిపారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతంలో తుమ్మల పర్యటించారు. ఈ క్రమంలో వరద బాధితులు తమ సమస్యలను మంత్రి దృష్టి తీసుకొచ్చారు.
మూడు రోజుల క్రితం ఖమ్మం పట్టణం మున్నేరు వరదలో చిక్కుకుంది. ఇంట్లోని విలువైన వస్తువులతో సహా అన్ని వరద నీటిలో కొట్టుకోపోయాయి. కేవలం కట్టుబట్టలతోనే ఖమ్మం లోని వరద బాధితులు దీన స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి, దాతాల నుంచి ఏమైనా సాయం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకునేందుకు పలు చర్యలు తీసుకుంది. అలానే సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతుగా వరద బాధితులకు సాయం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక వరదల ధాటికి దెబ్బతిన్న ఖమ్మంలోని పలు ప్రాంతాలను చూస్తే మనస్సు చలించి పోతుంది. అంతాల మున్నేరు నదిలో ఖమ్మం ప్రజలను నిండా ముచేసింది. ఇలా దీనస్థితిలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం కాస్తా ఊరటనిస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.