iDreamPost
android-app
ios-app

HYDలో రౌడీషీటర్ల వీరంగం.. పిస్తాహౌజ్లో భోజనం చేస్తున్న కస్టమర్స్పై దాడి

  • Published Mar 03, 2024 | 5:19 PM Updated Updated Mar 03, 2024 | 5:19 PM

హైదరాబాద్ లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. పిస్తా హౌజ్ లో భోజనం చేస్తున్న కస్టమర్లపై దాడి చేస్తూ చెలరేగిపోయారు. 17 మంది రౌడీ ముఠా కస్టమర్లను కొడుతూ, హోటల్ లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.

హైదరాబాద్ లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. పిస్తా హౌజ్ లో భోజనం చేస్తున్న కస్టమర్లపై దాడి చేస్తూ చెలరేగిపోయారు. 17 మంది రౌడీ ముఠా కస్టమర్లను కొడుతూ, హోటల్ లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.

  • Published Mar 03, 2024 | 5:19 PMUpdated Mar 03, 2024 | 5:19 PM
HYDలో రౌడీషీటర్ల వీరంగం.. పిస్తాహౌజ్లో భోజనం చేస్తున్న కస్టమర్స్పై దాడి

హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల విషయంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అల్లర్లకు పాల్పడి జనాలకు ఇబ్బంది కలిగించే వారి పై ఉక్కుపాదం మోపుతున్నారు. రౌడీ మూకల ఆటలు సాగకుండా వారి భరతం పడుతున్నారు. పోలీసులు ఇంత పకడ్భందీగా వ్యవహరిస్తున్నప్పటికీ కొందరు రౌడీలు మాత్రం చెలరేగి పోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో రౌడీలు వీరాంగం సృష్టించారు. ఓ హోటల్ లో భోజనం చేస్తున్న కస్టమర్లపై భౌతిక దాడులకు పల్పడుతూ నానా రచ్చ చేశారు. 17 మంది రౌడీలు ఈ దారుణానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

రాజేంద్ర నగర్ ఉప్పరపల్లి పిస్తా హౌజ్ లో రౌడీలు చెలరేగిపోయారు. హోటల్ లోకి ప్రవేశించి అక్కడ భోజనం చేస్తున్న వారిపై దాడికి తెగబడ్డారు. ఏం జరుగుతుందో తెలియక కస్టమర్లు, హోటల్ సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. 17 మంది రౌడీ ముఠా కస్టమర్లను కొడుతూ, హోటల్ లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. మొబైల్ ఫోన్ లో వీడియోలు తీస్తూ రెచ్చిపోయారు. దీంతో భయాందోళనకు గురైన కస్టమర్లు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. రౌడీ షీటర్లు అంతటితో ఆగకుండా అక్కడ పార్కింగ్ చేసిన టూ వీలర్స్ ను ధ్వంసం చేశారు. పిస్తా హౌజ్ యాజమాన్యం అత్తాపూర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom