iDreamPost
android-app
ios-app

నెల రోజుల్లో భారీగా పెరిగిన సన్న బియ్యం ధరలు!

Rice Price: ఇటీవల కాలంలో బియ్యం ధరలు పెరిగి.. దిగువ, మధ్యతరగతి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. రెండు, మూడు నెలల క్రితం వరకు మాములుగానే ఉన్న ధరలు అమాంతం  పెరిగాయి.

Rice Price: ఇటీవల కాలంలో బియ్యం ధరలు పెరిగి.. దిగువ, మధ్యతరగతి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. రెండు, మూడు నెలల క్రితం వరకు మాములుగానే ఉన్న ధరలు అమాంతం  పెరిగాయి.

నెల రోజుల్లో భారీగా పెరిగిన సన్న బియ్యం ధరలు!

నేటికాలంలో రోజు రోజూకు వస్తువులు ధరలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. నిత్యవసర వస్తువుల నుంచి ఇంధనాల వరకు ప్రతి దాని ధర సామాన్యుడిని భయపెడుతున్నాయి. ఇక తినే బియ్యం ధరల విషయంలో కూడా ఏ మాత్రం ఆశజనకంగా లేదు. ఇటీవల కాలంలో బియ్యం ధరలు పెరిగి..దిగువ, మధ్యతరగతి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. రెండు, మూడు నెలల క్రితం వరకు మాములుగానే ఉన్న ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది అంటే.. దొడ్డు బియ్యం తినలేక, సన్న బియ్యం కొనలేక పస్తులు ఉండాల్సినట్లుగా ఏర్పడింది. నెల రోజుల్లోనే సన్న బియ్యం ధర భారీగా పెరిగింది.

సామాన్య ప్రజలకు నిత్యం ఏదో ఒక వస్తువు, అవసరం భయపెడుతూనే ఉంది. గతంలో ఉల్లిగడ్డలు, టమాటాల ధరలు బంగారంతో పోటీ పడతామన్నట్లు సాగాయి. వాటి ధరలు కాస్తా తగ్గి సామాన్యుడు సంతోషించే లోపే మరో నిత్యవసర వస్తువు ధర పెరుగుతుంది. ఇవన్ని అనుకుంటే గ్యాస్ ధరలు పెరుగుతుంటాయి. ఇలా నాలుగువైపుల నుంచి ఏదో ఒక వస్తువు సామాన్యుడికి గుదిబండలాగా మారుతుంది. తాజాగా సన్న బియ్యం.. తన వంతు వచ్చిందనట్లు ధర కొండెక్కింది.

rice bag cost increased

రెండు , మూడు నెలల వరకు మాములుగా ఉన్న సన్న బియ్యం ధర.. అమాంతం పెరిగింది. నెల రోజుల్లోనే రూ.800 నుంచి  రూ.1000 కి పెరిగింది. పెరిగిన ధరలతో పేద మధ్య తరగతి ప్రజలు నరకం చూస్తున్నారు. గతంలో క్వింటాలు సన్న బియ్యానికి రూ.4,000 నుంచి రూ.4,500 వరకు ఉండేది. ప్రస్తుతం రూ.6,000 నుంచి రూ.7,000 వరకు చేరింది. దీంతో సామాన్యులు సన్న బియ్యం  కొనలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బియ్యం ధరలను అదుపు చేసి, సామాన్యులకు అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గత సంవత్సరం తో పోలిస్తే పాత, కొత్త బియ్యానికి రెక్కలు వచ్చా. బియ్యం ధరలు పెరగడంతో రైతులు పండించిన వరి ధాన్యానికి  ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఆహార గింజల కొరతతోపాటు యాసంగిలో వరి కోతల ముందు తుపాన్‌ ప్రభావంతో ధాన్యం తడిసిపోయింది. ఇదే సమయంలో ఇతర రాష్ర్టాల్లో ధాన్యానికి డిమాండ్‌ ఉండడంతో ఎగుమతులు ఎక్కువయ్యాయి. ఇలాంటి మరికొన్ని కారణాలతో సన్న బియ్యం ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. ఈ సీజన్లో గ్రేడ్‌ ‘ఏ’ రకానికి రూ.2,203, కామన్‌ గ్రేడ్‌ రకానికి రూ.2,183 ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్నది. ఇక ప్రైవేటు వ్యాపారులు అయితే క్వింట ధాన్యానికి రూ. 3100 నుంటి రూ.3200 వరకు కొనుగోలు చేస్తున్నారు.

మూడు నెలల క్రితం వరకు చూసినట్లు అయితే బియ్యం ధరలు చాలా సాధారణంగానే ఉన్నాయి.  ఈ నెల రోజుల వ్యవధిలోనే ఒకసారిగా పెరగడంతో పేద ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం బియ్యం క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1000 వరకు పెరగడంతో ప్రజలు ఉకిరిబికిరవుతున్నారు. జై శ్రీరామ్‌ కొత్త బియ్యానికి రూ.6000 నుంచి రూ.6200 వరకు, పాత బియ్యానికి రూ.7500 నుంచి రూ.7800 ఉంది. విజయ మసూరి కొత్త బియ్యం క్వింటాలు రూ.4500 నుంచి రూ.4800 వరకు ఉంది. అలానే విజయ మసూరి  పాత బియ్యం రూ.5800 నుంచి రూ.6200 ఉంది. ఆర్ఎన్ఆర్ రకాని చెందిన కొత్త బియ్యం రూ.5200 నుంచి రూ.5500 వరకు ఉంది. ప్రస్తుతం ధరలు చూసి… సన్నబియ్యం కొనాలంటే జనం జంకుతున్నారు.