iDreamPost
android-app
ios-app

విద్యార్థినులకు EV స్కూటర్లను ఇవ్వనున్న రేవంత్ రెడ్డి సర్కార్.. ఎప్పటినుంచంటే..?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆరు గ్యారెంటీలతో పాటు మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేసేందుకు ముమ్ముర ప్రయత్నాలు చేస్తుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు చేపట్టింది. ఇప్పుడు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆరు గ్యారెంటీలతో పాటు మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేసేందుకు ముమ్ముర ప్రయత్నాలు చేస్తుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు చేపట్టింది. ఇప్పుడు..

విద్యార్థినులకు EV స్కూటర్లను ఇవ్వనున్న రేవంత్ రెడ్డి సర్కార్.. ఎప్పటినుంచంటే..?

తెలంగాణలో కొలువైన కాంగ్రెస్ సర్కార్.. ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. వంద రోజుల్లో తాము ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగానే మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు, యువతులకు, విద్యార్థినులకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆరోగ్య శ్రీ కార్డుపై పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. అలాగే కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ, మహిళలకు నెలకు రూ. 2500 పంపిణీ వాటిని కూడా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలాగే 18 నిండిన విద్యార్థినులకు ఎలక్ట్రికల్ స్కూటర్లు అందిస్తామని హామీనిచ్చింది. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు కసరత్తులు మొదలు పెట్టింది.

చెప్పినట్లుగానే హామీలను అమలు చేసుకుంటూ పోతుండటంతో.. ఉచిత ఎలక్ట్రికల్ స్కూటర్స్ కోసం ఎదురు చూస్తున్నారు కాలేజీ విద్యార్థినులు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ పథకాన్ని ప్రారంభించి.. యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ముందస్తుగా అధికారులకు అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. పథకం అమలు తీరుపై విధి విధానాలను రూపొందించాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో అధికారులు ఈ పథకం అమలు.. వాటి తీరు తెన్నులపై, ఇతర అంశాలపై దృష్టి సారించారట. కేవలం 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు మాత్రమే ఈ పథకం కింద ఎలక్ట్రికల్ స్కూటర్లను అందించనున్నారు. అదీ కూడా రెగ్యులర్‌గా కళాశాలలకు వెళ్లే అమ్మాయిలకు మాత్రమే ఈ పథకం వర్తించేలా కార్యాచరణను సిద్దం చేస్తున్నారట అధికారులు.

రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అమ్మాయిలు ఎంత మంది ఉన్నారో లెక్కలు వేస్తోంది అధికార యంత్రాంగం. అయితే ఈ మొత్తం పథకం అమలు చేయడానికి భారీగా ఖర్చు అవుతుంది. ఎందుకంటే.. ఒక్కో స్కూటర్ ధర మార్కెట్‌లో సామర్థ్యం బట్టి సరాసరిగా రూ. 40 వేల నుండి లక్షన్నర పై చిలుకే ఉంది. ఈ లెక్కన చూస్తే.. రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసన్, డిగ్రీ, పీజీ, వృత్తి, వివిధ మేనేజ్ మెంట్ కాలేజీల్లో చదువుతున్న అమ్మాయిలంతా ఈ పథకానికి వర్తిస్తారు. రాష్ట్ర వ్యాపంగా వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో సుమారు 5,279 కాలేజీలు ఉన్నాయి. ఈ మొత్తం కాలేజీల్లో 5 లక్షల మందికి పైగా విద్యార్థినులు ఉంటారు. వీటిల్లో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 1,784 కాలేజీలు ఉన్నాయి. అంటే సుమారు 2 లక్షల మంది కాలేజీ అమ్మాయిలు చదువుతున్నారు. వీటిల్లో 70 వేల మంది ప్రభుత్వ కళాశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు.

తొలుత వారికే

ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్‌కు తొలి ప్రాధాన్యతనివ్వాలని భావిస్తోందట ప్రభుత్వం. దీనికి కూడా తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇలా చూసినా..ఈ పథకానికి వ్యయం భారీగా అయ్యేటట్లు కనిపిస్తోంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి సంస్థలకు ఎలక్ట్రికల్ టు వీలర్లపైన ఫేమ్‌ (ఫాస్టర్‌ అడాప్షన్‌ ఆఫ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఇన్‌ ఇండియా)–2 పథకం కింద రాయితీ అందిస్తోంది. ఈ పథకం కింద ఒక్కో స్కూటీకి దాని ఎక్స్‌–ఫ్యాక్టరీ ధరలో గరిష్టంగా 40 శాతానికి సమానంగా సబ్సిడీ అందిస్తోంది. ఈ లెక్కలు కూడా బేరీజు వేసుకుని ఈ పథకం అమలు కోసం విధివిధినాలు రూపొందిస్తున్నారు అధికారులు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీని బట్టి అంచనా వేస్తే.. ఒక స్కూటీకి సుమారు రూ. 50 వేల చొప్పున ధర లెక్కిస్తే.. 70 వేల మంది విద్యార్థినులకు సుమారు రూ. 350 కోట్ల ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సబ్సిడీ లేకుంటే.. ఆ ఖర్చు రెండింతలు అవుతోంది. మరీ ప్రభుత్వ కాలేజీ విద్యార్థినులకు అందిస్తే.. ప్రైవేట్ కాలేజీ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటీ అన్న ప్రశ్న వస్తోంది.

ఇంజనీరింగ్ విద్యార్థినులే అత్యధికం

18 ఏళ్లకు పైబడిన అమ్మాయిల్లో ఎక్కువ మంది ఇంజనీరింగ్ విద్యార్థినులే అత్యధికం. అందులోనూ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఎక్కువ. ప్రభుత్వం ఇచ్చే రీయింబర్స్ మెంట్‌తో చదువుకుంటున్న పేద, మధ్యతరగతి విద్యార్థినులు అత్యధికంగా ఉంటారు. ఎలక్ట్రిక్‌ స్కూటీ పథకం కింద ఓన్లీ గవర్నమెంట్ కాలేజీ విద్యార్థినులకు వర్తింపజేస్తే.. వీరు అర్హత కోల్పోయే అవకాశం ఉంది. అలాగే ప్రైవేటు కళాశాల్లో డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి నైపుణ్యం కోర్టులు చేస్తున్న విద్యార్థినులు కూడా ఈ పథకానికి అర్హులు కాలేరు. ఇటీవల విడుదలైన ఓటర్ల జాబితాను బట్టి చూస్తే.. గ్రేటర్ పరిధిలో సమారు 1.08 కోట్ల వరకు ఓటర్లు ఉండగా.. అందులో 18 ప్లస్ కేటగిరిలోకి వచ్చిన కొత్త ఓటర్లు 4.5 లక్షలు ఉన్నారు. వారిలో మహిళలు 3 లక్షల మంది. వారిలో 2 లక్షల మంది విద్యార్థినులే అని తెలుస్తోంది. ఇప్పుడు వీరంతా తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకుని ఉంటారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మెచ్చి.. వారంతా ఓట్లు వేసిన వారే. మరీ ఇప్పుడు ప్రభుత్వ కాలేజీ విద్యార్థినులకు మాత్రమే ఇచ్చి.. మిగిలిన వారికి ఇవ్వకుంటే.. సమస్య పెద్దది అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడే అవకాశం ఉంది. ఈ సమస్యను కూడా  అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

పథకం అమలు చేస్తే..వచ్చే సమస్యలు

అయితే ఈ వాహనాలు అందించడం ఒక సమస్య అయితే.. ట్రాఫిక్, ఇతర అంశాలు కూడా పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు లేకపోలేదు. హైదరాబాద్ ట్విన్స్ సిటీస్‌లో ట్రాఫిక్ చాలా ఎక్కువ. నిత్యం ఇక్కట ట్రాఫిక్ చవిచూస్తూనే ఉంటారు ప్రజలు. గంటలు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుంటారు. నగరంలో సుమారు కోటిన్నర జనాభా ఉంటే.. సుమారు 70 లక్షల వాహనాలు ఇక్కడ తిరుగుతుంటాయి. ఇక బిజీ సమయాల్లో అయితే.. ఎక్కడిక్కడ వాహనాలు భారీగా నిలిచిపోతుంటాయి. ఇలాంటి సమయంలో విద్యార్థినులకు వాహనాలు ఇస్తే.. ట్రాఫిక్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇప్పటి వరకు ఎలక్ట్రికల్ వాహనాలకు లైసెన్స్ లేదు. ఇప్పుడు తప్పని సరి చేయబోతోంది. చాలా మందికి వాహనాలు నడపడం వచ్చినా.. డ్రైవింగ్ లైసెన్సులు లేవు. అలాగే రాని వారికి వాహనాలు ఇస్తే.. రహదారి భద్రత గురించి అవగాహన తక్కువగా ఉండటంతో.. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇన్సూరెన్స్‌ వర్తించే అవకాశం సైతం ఉండదు. అలాంటి వారికి అవగాహన కల్పించి.. లైసెన్స్ పొందేలా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మరీ ఈ పథకం సాధ్యా సాధ్యాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి